HomeAstrology2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

2025 Rasi Phalalu: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. 2025 విశ్వావసు నామ సంవత్సరంలో (2025 Rasi Phalalu) ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఆయన వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యలో ఆయన ఈ విశేషాలు పంచుకున్నారు.

ఈ సంవత్సరానికి అధిపతి రవి. రవి కమాండ్ చేస్తాడు. ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం.. దేశ వ్యాప్తంగా, పలు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సంచలనాలు నమోదవుతాయి. రాజులు, రాష్ట్రాల మధ్య గొడవలు. ప్రముఖ రాజకీయ నాయకులకు మృత్యుగండం ఉంది. అన్ని రంగాల్లోనూ యువకులు 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి గుండె పోటు ప్రమాదం పెరుగుతుంది. రవి అంటే చర్మం, గుండె, కళ్లు, ఎముకలపై ఎఫెక్ట్ చూపుతాడు. (2025 Rasi Phalalu)

ఒక సమస్య, వైరస్ ప్రపంచాన్ని బాధిస్తుంది. చర్మంపై దాడి చేస్తుంది. సమస్యలు సృష్టిస్తుంది. అలాగే ఈ సంవత్సరం గుండెపోటు వల్ల మరణాలు ఎక్కువ. ఎండల తీవ్రత చాలా ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా అగ్ని పర్వతాల పేలుడు ఎక్కువ. మంచు పర్వతాలు కరగడం వల్ల వాతావరణంలో మార్పులు. అమెరికా దేశానికి విపరీతమైన గాలి తుఫాన్లు, వరదలు ఉంటాయి. ఒకటి రెండు దేశాల మధ్యయుద్ధ వాతావరణం ఉంటుంది. తీవ్రత పెరుగుతుంది.

2025 సెప్టెంబర్ 7న రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. (2025 Rasi Phalalu) కుంభరాశికి వ్యతిరేక ఫలితాలు. మే 9 నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు సంబంధించి పవన్ కల్యాణ్ కు ఏలినాటి శని వెళ్లిపోతుంది. లోకేష్, పవన్ కల్యాణ్ కు విపరీత రాజయోగం ఉంటుంది. ఇప్పుడున్న పదవుల కంటే ఉన్నతమైన పదవులు పొందుతారు. ప్రభాస్ జాతకంలో అనుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వింటారు. తులారాశి కాబట్టి పెళ్లి అయ్యే చాన్స్ ఉంది.

రాశుల వారీగా.. (2025 Rasi Phalalu)

1. మేష రాశి
ఆదాయం 2
వ్యయం 14
రాజపూజ్యం 5
అవమానం 7

ఈ సంవత్సరం మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం. 24 సంవత్సరాలు నిండి ఉంటారో వారి జీవితంలో పెను మార్పులు. తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం, లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు. పోలీసు, కోర్టు కేసులు. సమాజంలో చెడ్డపేరు. ఉద్యోగంలో బదిలీలు. బంధువుల వల్ల సమస్యలు. వాహన ప్రమాదాలు. విద్యార్థులకు విదేశీయానం, చదువులో ఉత్తీర్ణత. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం. అవివాహితులకు వివాహ యోగ సూచన, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు. కానీ ఇన్ కమ్ ట్యాక్స్, జీఎస్టీల పరంగా సమస్యలు. రైతులకు ఆశించిన దాని కంటే దిగుబడి, రాబడి పెరుగుతాయి. ఆడవాళ్లకు అనుకూలత. కన్యా రాశి గానీ, వృశ్చికరాశి వారు గానీ ఉంటే సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. (2025 Rasi Phalalu)

* దోష నివారణ కోసం: నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. బ్లూ కలర్ కలర్ దుస్తులు వాడితే సమస్యల నుంచి బయట పడతారు. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో శనిపూజ చేసుకుంటే సమస్యల నుంచి బయట పడతారు.

2. వృషభరాశి
ఆదాయం 11
వ్యయం 5
రాజపూజ్యం 1
అవమానం 3
వీరికి రాహువు, కేతువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శని సానుకూలత వల్ల చాలా సానుకూలం. ఈ సంవత్సరం ప్రతి విషయం అనుకూలతలు అన్ని రంగాల వారికీ. వ్యవహార జయం. బంధుమిత్ర సౌఖ్యం, కుటుంబంలో సంతోషాలు. శుభకార్యాలు, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. వ్యాపారంలో విపరీత లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు. పోలీసు, న్యాయ వాదులకు విపరీతమైన అనుకూలత. విద్యార్థులకు విదేశీయానం. విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ అవకాశం. విదేశాల్లో వ్యాపారాలు చేసే వారికి ఇతర అవకాశాలు. వ్యాపారంలో విపరీత లాభాలు. అవివాహితులకు వివాహం, సంతానం లేని వారికి సంతానం, రైతులకు విపరీత లాభాలు. రైతులు ఎరుపురంగు పంటలు పండిస్తే లాభాలు.

3. మిథున రాశి
ఆదాయం 14
వ్యయం 2
రాజపూజ్యం 3
అవమానం 3
ఈ సంవత్సరం వీరికి విపరీత రాజయోగం. ప్రతి పనీ కలిసిరావడం, ధన రాబడి. వ్యవహారాల్లో జయం. ఉద్యోగాల్లో అభివృద్ధి, బుద్ధి బాగా పని చేస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లాభం. గురు బలం వల్ల చెడ్డపేరు పోయి మంచి పేరు. జనాల్లో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు పొందుతారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినిమా పరిశ్రమ వారికి విపరీతమైన పేరు. విద్యార్థులకు బాగుంది. స్త్రీలకు విపరీత రాజయోగం. అవివాహిత అమ్మాయిలకు వివాహ యోగం. స్త్రీలు వ్యాపారాలు ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది. ప్రారంభించిన వ్యాపారాల్లో విపరీత లాభాలు. న్యాయవాదులు, పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వారికి మంచి పేరు ప్రఖ్యాతలు, ప్రమోషన్లు.

4. కర్కాటక రాశి
ఆదాయం 8
వ్యయం 2
రాజపూజ్యం 7
అవమానం 3
ఈ రాశి వారికి అష్టమ శని వెళ్లిపోతుంది. 9వ ఇంట్లోకి శని వెళ్తున్నాడు. గురువు వ్యయంలోకి వస్తున్నాడు. చాలా చాలా అనుకూలంగా ఉంది. గొంతు నుంచి బొడ్డు వరకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు. కాళ్లు, చేతులు విరగడం లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన విషయాల్లో చాలా అనుకూలం. విదేశీ యానం, విదేశాల్లో వ్యాపారాలు, పెట్టుబడులు కలిసొస్తాయి. దూరమైన వాళ్లు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కుంటారు, కోర్టు వ్యవహారాల్లో జయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. విదేశీ యానం, చదువు. ఉత్తీర్ణత. అవివాహితులకు వివాహ యోగం, సంతానం లేని వారికి సంతాన యోగం. అన్ని రంగాల వారికీ జీవనం సుసంపన్నం. కష్టాలు తొలగిపోతాయి. రైతులకు అనుకూలతలు. ఒకే ఒక్క సమస్య గురువు వ్యయంలో ఉండటం.

* దోష నివారణ కోసం: గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించాలి. వీలైనప్పుడు శ్రీకాళహస్తి గురు దక్షిణామూర్తిని దర్శించుకోవాలి. కామాక్యలోని బగళాముఖి అమ్మవారిని దర్శించుకుంటే సమస్యలు దరిచేరవు.

5. సింహ రాశి
ఆదాయం 11
వ్యయం 11
రాజపూజ్యం 3
అవమానం 6
ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభం. రాహువు 7వ స్థానం, కేతువు జన్మంలో ఉండటం వల్ల కొన్ని సమస్యలు. తల్లి ఆరోగ్యం ఇబ్బందికరం. బంధువులు, స్నేహితులతో విరోధం. నరదృష్టి. ఉద్యోగంలో ఆటంకాలు. సంఘంలో నరదృష్టి వల్ల మీపై అసూయ వల్ల జనాలు మిమ్మల్ని చెడుగా చూపించే ప్రయత్నాలు చేస్తారు. మానసికంగా ఇబ్బందులు. సినీరంగం, రాజకీయం, వ్యవసాయ రంగం, న్యాయవాద వృత్తి, ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి విశేషంగా అనుకూలం. పలు రకాలుగా విపరీతమైన ఆదాయం వస్తుంది. కానీ వచ్చిన ఆదాయం నిలబడదు. ఖర్చుఅయిపోతుంది.

* అష్టమ శని పరిహారం కోసం: నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. బ్లూ కలర్ దుస్తులు ధరించాలి. తిరునల్లార్ శనైశ్చర ఆలయంలో శనిపూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుంచి బయటపడతారు. శనివారం నియమాన్ని పాటించాలి. రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ చేయడం వల్ల సమస్యల నుంచి బయట పడతారు.

6. కన్యా రాశి
ఆదాయం 14
వ్యయం 2
రాజపూజ్యం 6
అవమానం 6
చాలా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యలాభం, ధన లాభం, బంధుమిత్ర లాభం, నూతన గృహ లాభం, భూ లాభం, అన్ని రంగాల వారికీ జీవనం బాగుంటుంది. న్యాయ వాద వృత్తిలో ఉండే వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి చాలా బాగుంది. ప్రమోషన్లు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ యానం. విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు. వ్యాపారస్తులకు లాభదాయకం. పెళ్లి కాని యువతులకు వివాహ యోగం. సంతానం లేని వారికి సంతాన యోగం, ఉద్యోగ యోగం. ఎలా చూసుకున్నా పూర్తి స్థాయిలో అన్ని రంగాల వారికీ అనుకూలమైన ఫలితలు గోచరిస్తున్నాయి. రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్త్రీలు.. అందరికీ అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

*ఎలాంటి దోష నివారణ అవసరం లేదు.

7. తులా రాశి
ఆదాయం 11
వ్యయం 8
రాజపూజ్యం 2
అవమానం 2
వీరికి ఈ సంవత్సరం సమస్యాత్మకంగా ఉంది. 6వ స్థానంలో శని సంచారం వల్ల విపరీతమైన అనుకూలతలు. 98 శాతం అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. అన్ని రంగాల్లో ఆధిక్యత, వ్యవహారాలు లాభించడం, అప్రయత్న ధన లాభం. స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో రాణించడం. స్థిరాస్తి వృద్ధి, బంధు మిత్ర లాభం, వ్యాపార, ఉద్యోగ లాభం, అవివాహితులకు వివాహ యోగం, రైతులకు అన్ని పంటల్లో అనుకూలం. దిగుబడి, రాబడి ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా పోలీసు, ఐపీఎస్, ఐఏఎస్ పదవుల్లో ఏసీబీ, సీబీఐ, ఈడీ లాంటి సమస్యలు. సంతానం లేని వారికి సంతాన యోగం. అతి ముఖ్యమైన విషయం… వీరి జీవితంలో ఈ సంవత్సరం అతిపెద్ద పెను సంచలనం ఉంటుంది. పోలీసు కేసు గానీ, కోర్టు కేసు గానీ, మీడియాకు ఎక్కడం, సమాజంలో ప్రచారం, చెడ్డపేరు ఏర్పడటం కనిపిస్తోంది. దోష నివారణ కోసం గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం, తిరునల్లార్ శనైశ్చర ఆలయంలో ప్రత్యేక శని పూజలు చేయించుకుంటే సమస్యల నుంచి బయట పడతారు.

8. వృశ్చిక రాశి
ఆదాయం 2
వ్యయం 14
రాజపూజ్యం 5
అవమానం 2
ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్లిపోతుంది. చాలా బాగుండే అవకాశం. సమాజంలో నరదృష్టి వల్ల, ఇతర జనాల వల్ల శత్రుత్వం పెరుగుతుంది. వీరు ఏ రంగంలో ఉంటే అదే రంగంలో ఉన్న వారు చెడు చూపుతో చెడ్డపేరు తెచ్చే చాన్స్. వృత్తి, వ్యాపారాల యందు రాణించడం. ప్రతి పనీ కలిసి వస్తుంది. ఇంటా బయటా అనుకూలం. బంధువులు తీవ్రంగా వ్యతిరేకించే చాన్స్. సంతాన సమస్యలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం. మీడియా, సినిమా పరిశ్రమ వారికి, రాజకీయ రంగం, న్యాయవాద రంగం వారికి చాలా చాలా అనుకూలం. గవర్నమెంట్ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ల పరంగా ఇన్ కమ్ ట్యాక్స్ పరంగా, జీఎస్టీల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం.
* వీరికి ఎలాంటి దోష నివారణ అవసరం లేదు.

9. ధనుస్సు
ఆదాయం 5
వ్యయం 3
రాజపూజ్యం 1
అవమానం 5
అర్ధాష్టమ శని ప్రారంభం అవుతోంది. సమాజంలో విపరీతమైన సమస్యలు, చెడ్డ పేరు. కుటుంబంలో పోలీసు, కోర్టు కేసుల వల్ల సమస్యలు. అయినప్పటికీ గెలుపు మీదే అవుతుంది. మీ చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. సంఘంలో ఉన్నత స్థితి ఉంటుంది. గృహాన్ని నిర్మించాలనే ఆలోచనలు ఫలిస్తాయి. రైతులు, వ్యాపారస్తులకు అనుకూలం. కానీ అన్ని రంగాల వారికీ ఇన్ కమ్ ట్యాక్స్, జీఎస్టీల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశాలు. విద్యార్థులు, ఉద్యోగులు, అవివాహితులకు అన్ని రకాలుగా అనుకూలత. మరీ ముఖ్యంగా స్త్రీలకు అనుకూలం. కొత్త వ్యాపారాలు ప్రారంభించే స్త్రీలకు రాజయోగం గోచరిస్తోంది. పది రూపాయలకు వంద రూపాయల లాభాన్ని పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెళ్లికాని యువతులకు వివాహ యోగం. సంతానంలేని వారికి సంతాన యోగం. కొత్తగా భూమి కొనడం, లేదా గృహ నిర్మాణం జరిపించడం గోచరిస్తోంది. విద్యార్థులకు విదేశీయానానికి అనుకూలం. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సూచనలు.

10. మకర రాశి
ఆదాయం 8
వ్యయం 14
రాజపూజ్యం 4
అవమానం 5
ఏలినాటి శని వెళ్లిపోతోంది. గత 8 సంవత్సరాల నుంచి మీరు పడుతున్న కష్టాలకు విముక్తి. విపరీత అనుకూలం. విపరీత రాజయోగం. విద్యార్థులు, ఉద్యోగులకు పూర్తి స్థాయి అనుకూలతలు. విదేశీయానం. విదేశీ పెట్టుబడులకు అనుకూలతలు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు అనుకూలతలు. అనుకోకుండా పదవీ లాభం. పెద్ద మంత్రి స్థాయి వరకు వెళ్లే అవకాశాలు. కుటుంబంలో ఎవరైనా ఒకరు దూరం అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్త్రీలకు అనుకూలం. చాలా చాలా బాగుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం పరంగా అనుకూలం. వైద్య రంగంలో ఉండే వారికి అనుకూలం. ప్రభుత్వ ఉద్యోగంలో పని చేసే వారికి ప్రమోషన్లు. అన్ని రంగాల్లో ఉన్న వారికి యోగ కాలం.

11. కుంభ రాశి
ఆదాయం 8
వ్యయం 14
రాజపూజ్యం 7
అవమానం 5
శని జన్మం నుంచి మళ్లీ ఏలినాటి శనికి వస్తున్నాడు. 3వ దశ ఏలినాటి శని ఈ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. శని వల్ల సమస్యలు కనిపిస్తున్నాయి. మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల మతిభ్రంశం, బుద్ధిమాంద్యం, ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఆరోగ్య భంగం, ఆదాయానికి ఇబ్బంది. ఇన్ కమ్ ట్యాక్స్, జీఎస్టీ పరమైన ఇబ్బంది. న్యాయ పరమైన ఇబ్బందులు, సంతానం వల్ల చికాకులు. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యభంగం, ప్రాణ నష్టం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ట్యాక్సుల పరంగా ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఐపీఎస్, ఐఏఎస్ లాంటి వారికి ఏసీబీ, సీబీఐ, ఈడీ నుంచి సమస్యలు ఏర్పడే అవకాశాలు. వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

* దోష నివారణకు: నల్ల రంగు బట్టలకు దూరంగా ఉండాలి. బ్లూ కలర్ దుస్తులు ధరించండి. తిరునల్లార్ శనైశ్చర ఆలయంలో ప్రత్యేక శనిపూజలు.

12. మీన రాశి
ఆదాయం 5
వ్యయం 3
రాజపూజ్యం 3
అవమానం 1
ఏలినాటి శని జన్మ శనిగా మారుతోంది. 25 సంవత్సరాలు పైబడి ఉన్న వారి జీవితంలో విపరీతమైన సమస్యలు ఈ సంవత్సరం కనిపించబోతున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారికి విపరీత సమస్యలు. భార్యాభర్తలకు ఎడబాటు. ఏలినాటి ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు. ఆందోళనలు, భయానక సంఘటనలు, శుభకార్యాలకు ఆటంకాలు, మరీ ముఖ్యంగా వెన్నెముకకు సంబంధించిన సమస్యలు. సయాటికా లాంటి ఆరోగ్య సంబంధ సమస్యలు వస్తాయి. రాబడి తగ్గడం వల్ల వాయిదాలు కట్టడం కష్టం. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం. వాహన ప్రమాదాలు, పోలీసు కేసులు, కోర్టు కేసులు, మీడియాకు ఎక్కడం, అనవసర విషచయాలు చుట్టు ముడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి. మీ ఆలోచన వల్ల మీ సొంత నిర్ణయాల వల్ల చేతులారా సమస్యలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు విదేశీ యానంలో అడ్డంకులు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగంలో అడ్డంకులు, వీసాల పరంగా సమస్యలు. ప్రభుత్వ రంగంలో పని చేసే వారికి ఐఏఎస్,ఐపీఎస్ లాంటి వారికి సీబీఐ, ఏసీబీ కేసుల భయం. వ్యాపారస్తులకు జీఎస్టీ, ఇన్ కమ్ ట్యాక్స్ ఇబ్బందులు. ఏరకంగా తీసుకున్నా పుట్టినప్పటి నుంచి తీసుకుంటే ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉండబోతున్నాయి. సమస్యలుఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి.

దోష నివారణ: నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. బ్లూ కలర్ దుస్తులు వాడండి. తిరునల్లార్ శనైశ్చర ఆలయంలో ప్రత్యేక శనిపూజలు, శ్రీకాళహస్తిలో గురువారం గురు దక్షిణా మూర్తిని దర్శించుకోండి.

ఇవీ చదవండి: Rasulu : రాశులు ఎన్ని? వాటి ప్రాశస్త్యం ఏమిటి?
Rasi Phalalu 2024 Venu swamy: వేణు స్వామి చెప్పిన సంచలనాలు.. 2024లో ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!
Taurus: వృషభరాశి వారి లక్షణాలు.. స్థిరమైన నిర్ణయాలతో ఆకట్టుకుంటారు..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు