Congress 6 promises: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీలకు సంబంధించిన లోగో, పోస్టరు, దరఖాస్తు ఫారాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Congress 6 promises)
* డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల దరఖాస్తులు స్వీకరిస్తారు.
* ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
* జనవరి 7వ తేదీలోపు లబ్ధిదారుల వివరాలు సేకరిస్తారు.
* ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు. ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారు.
* రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ తెలిపారు.
* ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.
* రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పరిమితి విధించలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు.
* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందని సీఎం చెప్పారు.
* ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించామని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామని సీఎం చెప్పారు.
* గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని సీఎం అన్నారు.
* గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వచ్చని తెలిపారు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపారు.
* రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తారు.
* ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు.
* ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నట్లు సీఎంరేవంత్ తెలిపారు.
* ప్రతి మండలం రెండు గ్రూపులు ఉంటాయని, ఒక గ్రూప్ కి ఎండీఓ.. మరో గ్రూప్ కి ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని సీఎం తెలిపారు.
ఇదీ చదవండి: CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..
