HomeTelanganaTelangana Elections: తెలంగాణలో జెండా పాతే పార్టీ ఏది? రేపే పోలింగ్‌.. కట్టుదిట్టమైన భద్రత

Telangana Elections: తెలంగాణలో జెండా పాతే పార్టీ ఏది? రేపే పోలింగ్‌.. కట్టుదిట్టమైన భద్రత

Telangana Elections: తెలంగాణలో ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసింది. రేపు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్‌ ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. హోరాహోరీ ప్రచారంతో తెలంగాణ గత నెలన్నర రోజులుగా వేడెక్కింది. ఇక రేపు పోలింగ్‌ నేపథ్యంలో ప్రధాన పార్టీలు, అభ్యర్తులు ప్రలోభాలకు తెరతీశారు. (Telangana Elections)

ప్రభుత్వ వ్యతిరేకత, ఆరు గ్యారెంటీల పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు అభివృద్ధి, సంక్షేమం, పోల్ మేనేజ్‌మెంట్ పై బీఆర్ఎస్ నమ్మకంగా కనిపిస్తోంది. ఇక హంగ్ తప్పదు….కింగ్ మేకర్ అవుతామంటూ బీజేపీ యోచిస్తోంది. కామారెడ్డి పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కామారెడ్డి నా స్వస్థలమంటున్నారు సీఎం కేసీఆర్. అక్రమార్కుల వేటకు వచ్చిన వేటగాడినంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.

జంట నగరాల్లో 144 సెక్షన్

ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు. ఎన్నికలు ముగిసే వరకు మూడు రోజులపాటు లిక్కర్ అమ్మకాలపై ఆంక్షలుంటాయి. బార్లు, వైన్ షాపులు, పబ్‌లు మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల అధికారి వికాస్ రాజ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ..
* ఏరాజకీయ పార్టీ ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదు.
* సినిమాలు, సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిలిపివేయాలి
* వాహనాల్లో ఓటర్లను తరలిస్తే క్రిమినల్ చర్యలు
* బ్యాలెట్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ చిత్రీకరించకూడదు

* డబ్బు,మద్యం పంపిణీ నియంత్రణకు కఠిన చర్యలు
* ఈవీఎంలలో సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఇంజనీరింగ్ నిపుణులు
* ఓటర్లకు పంచే స్లిప్‌లలో అభ్యర్ధి పేరు ఉండకూడదు
* పార్టీలు సమావేశాలు పెట్టకూడదు

* పార్టీలు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వకూడదు
* 27,175 మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు హక్కువినియోగం
* 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
* ఎన్నికల విధుల్లో లక్షా 40 వేల మంది సిబ్బంది
* నిర్దేశించిన రూట్లలోనే పోలింగ్ సిబ్బంది ప్రయాణించాలి

* రాత్రి వరకు ఎపిక్ కార్డుల పంపిణీ పూర్తవుతుంది
* ఎపిక్ కార్డులు లేకపోతే ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్
* హైదరాబాద్ పరిధిలో రేపు, ఎల్లుండి విద్యాసంస్ధలకు సెలవు
* 30న ఐటీ ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి
* సెలవు ఇవ్వని సంస్ధలకు చట్టరీత్యా చర్యలు.

ట్రైసిటీ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు

బందోబస్తులో 70 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూ కౌల్ట్స్ తో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో సత్వర ప్రత్యేక బృందాలు ఉంటాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో 30 వేల మంది సిబ్బందితో బందోబస్తుకు సిద్ధమయ్యారు. పోలింగ్ రోజు అల్లర్లు జరిగితే నిమిషాల్లో స్పందించేందుకు ఐదంచెల భద్రత రెడీగా ఉంది.

రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్స్ సిద్ధం చేశారు. 4,400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు సిబ్బంది రెడీగా ఉన్నారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్, బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాయి. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో కేంద్ర బలగాల నిఘా ఉంది.

పోలింగ్‌కు సర్వం సిద్ధం..

* ఒకే విడతలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్
* సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్
* 221 మంది మహిళలు సహా బరిలో 2290 మంది అభ్యర్థులు
* తెలంగాణలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు
* పురుషులు – 1,62,98,418, మహిళలు – 1,63,01,705
* తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు
* పోలింగ్ కోసం 59,779 ఈవీఎంల ఏర్పాటు
* డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఇదీ చదవండి: PM Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు