Venu Swamy: తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిలోపే ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు మాటల యుద్ధం మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో గెలుపెవరిది? మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటారా? అటువైపు తనకు ఇవే చివరి ఎన్నకలన్ని చెబుతున్న చంద్రబాబు (Chandrababu) మళ్లీ సీఎం అవుతారా? ఇటువైపు చూస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా (BRS Party) మార్చిన సీఎం కేసీఆర్.. (CM KCR) హ్యాట్రిక్ సాధిస్తారా? ప్రత్యేక తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని తామే ఇచ్చామంటున్న కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) పుంజుకొని అధికార పగ్గాలు చేపడుతుందా? అనే ప్రశ్నలు సగటు ఓటరు మదిలో మెదలుతున్నాయి. ఇదే అంశంపై ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు (Astrology) వేణు స్వామి (Venu Swamy) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు.
మొదటి ప్రాధాన్యం గురించి మాట్లాడితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి జాతకం బాగుందని వేణుస్వామి (Venu Swamy) పేర్కొన్నారు. నంబర్ వన్ ప్లేస్‌లో జగన్, రెండో స్థానంలో చంద్రబాబు, మూడో స్థానంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉంటారని వేణుస్వామి జోస్యం చెప్పారు. వీరిలో ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరనేది ఇప్పటికే తాను కన్ఫం చేసి చెప్పానని, మరోసారి వైఎస్ జగనే ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని వేణుస్వామి (Astrologer Venu Swamy) స్పష్టం చేశారు. వందకి వంద శాతం జగన్‌మోహన్‌రెడ్డి సీఎం (CM YS Jagan Mohan Reddy) అవుతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయ్యే యోగం ఆయనకే ఉందని పునరుద్ఘాటించారు వేణుస్వామి.
ఎన్నికలు సమీపించే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని వేణుస్వామి చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కాకుండా కొత్త సంఘటనలు జరుగుతాయన్నారు. ఏపీ, తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతుందని తెలిపారు. పార్టీల డ్యామేజ్‌లు జరుగుతాయన్నారు. పార్టీల్లో అప్ అండ్ డౌన్‌లు చోటు చేసుకుంటాయన్నారు. పార్టీల మధ్య వైరాలు పెరుగుతాయని, సన్నిహితంగా మెలిగే పార్టీలు వైరం పెంచుకుంటాయని చెప్పారు.
టీడీపీ, పవన్ కలుస్తారా అనేది క్వశ్చన్ మార్క్!
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో (Telugu Desam Party) పవన్ (Janasena Pawan Kalyan Varahi) కలుస్తారా? లేదా? అనేద తన దృష్టిలో క్వశ్చన్ మార్క్ అని వేణుస్వామి చెప్పారు. రేపు ఎన్నికలు సమీపించే నాటికి చాలా మార్పులు జరగొచ్చని వేణుస్వామి అన్నారు. ఒక వ్యక్తి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. అలాగే ఒక వ్యక్తి నాశనాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేసినా 50 శాతం చాన్సెస్ మాత్రమే ఉంటాయన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకొనే అవకాశం..
తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ పుంజుకుంటుందని వేణుస్వామి స్పష్టం చేశారు. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా అంగీకరించాల్సిన విషయమేనని తెలిపారు. రాష్ట్రంలో నంబర్ వన్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పోటీ పడతాయన్నారు. భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పరిమితమవుతుందన్నారు. గవర్నమెంట్‌లో రూలింగ్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని వేణుస్వామి చెప్పారు. అంటే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం దక్కే అవకాశాలున్నాయంటూ వేణుస్వామి నర్మగర్భంగా చెప్పకనే చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని తాను ముందే చెప్పానని, అలాగే జరిగిందని వేణుస్వామి చెప్పారు. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అల్టిమేట్ కాబట్టి తాను ప్రిడిక్ట్ చేసి చెప్పానన్నారు. 130-140 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పానని, చెప్పినట్లుగానే 136 సీట్లు కాంగ్రెస్‌కు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో కర్ణాటకలోనూ అదే పరిస్థితి ఉందన్నారు.
నాడు, నేడు.. జగన్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదు…
విజయవాడ, గుంటూరులో రెండు రోజులు తిరిగితే తన జాతకం కరెక్టా కాదా? అనేది తనకే భయం వేస్తుందన్నారు. వాళ్లు మాట్లాడే మాటలు అలా ఉంటాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలన గురించి డిఫరెంట్‌గా మాట్లాడతారన్నారు. ఇవే మాటలు 2019 ముందు కూడా మాట్లాడారని, కానీ, జగన్ సీఎం అయ్యారు కదా.. అని వేణుస్వామి గుర్తు చేశారు. ఆరోజు సీఎం కాకుండా ఆపలేకపోయారని, అలాగే ఈరోజు కూడా ఆపలేరని జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఒకవేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే జగన్‌కు టఫ్ ఫైట్ ఇస్తారని, కానీ పెద్ద మిరాకిల్స్ అయితే జరిగిపోవని వేణుస్వామి చెప్పారు. వైస్ జగన్‌మోహన్‌రెడ్డి బతికున్నంత వరకు జనాలు తిడుతూనే ఉంటారని, కానీ ఓట్లకు తిట్లకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సభ పెడితే ఇసకేస్తే రాలనంత జనం వస్తారని, అవన్నీ ఓట్ల కింద కన్వర్ట్ కావన్నారు. జనాలు వస్తున్నారని ఓట్లేస్తారనుకోవడం భ్రమ అని, అలాగే జనాలు తిడుతున్నారు కదా అని ఓట్లు వేయరనుకుంటే అది కూడా భ్రమేనని స్పష్టం చేశారు. అటు కేంద్రంలోనూ ఎక్కువ స్కోప్ హంగ్‌కే అవకాశం ఉందన్నారు. బీజేపీ డౌన్‌ఫాల్ మొదలైందన్నారు.
Read Also : CM Jagan At Polavaram: చిన్న సమస్యను విపత్తుగా చూపే దౌర్భాగ్యమైన మీడియా..! సీఎం జగన్ ఫైర్
