రాష్ట్రంలోని (Telangana) అన్నదాతలకు సీఎం కేసీఆర్ (CM KCR) ఊరట కలిగించే వార్త అందించారు. అకాల వర్షాల (Rains) కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana) గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) పంట నష్టపోయిన రైతులకు ఈ సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనెల 12వ తేదీ నుంచి రైతులకు నగదు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గతనెల 23వ తేదీన ముఖ్యమంత్రి స్వయంగా వరంగ్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి పరిశీలించి అన్నదాతలకు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో ఎకరానికి రూ.10 వేల చొప్పన పంట నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈనెల 12 నుంచి రైతులకు పంట నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను అందజేస్తామని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించినా ఇంత వరకు రైతులకు సాయం అందలేదని కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాలన్నీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అకాల వర్షాలు కూడా ముమ్మరంగా కురుస్తున్నాయి. దీంతో వర్షాల వల్ల నష్టపోయిన బాధిత అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ప్రతి బాధిత రైతుకూ పరిహారం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. కౌలు రైతులకు కూడా చెక్కులు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పంట నష్టపోయిన కౌలు రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 12వ తేదీ నుంచే పరిహారం చెక్కులు పంపిణీ చేస్తామంటూ ఇవాళ ప్రకటన చేసింది కేసీఆర్ సర్కార్.
వదలని వర్షాలు..
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఆగడం లేదు. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరం అకాల వర్షాలు మరోసారి ఎఫెక్ట్ అయ్యింది. వరద నీటి దాటికి కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ఇక రానున్న మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 24 డిగ్రీలుగా నమోదయ్యే చాన్స్ ఉంది. తూర్పు దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also : YS Jagan : రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీపై జగన్ సర్కార్ గుడ్ న్యూస్
