RGV On CBN: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV On CBN) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో ఎన్టీఆర్‌కు ప్రత్యేక నివాళులు అర్పించింది. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మూకుమ్మడిగా ఎన్టీ రామారావుకు అంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలో సంచలన దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో (RGV On CBN) స్పందించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఉదంతాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు ఆర్జీవీ.
విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రామ్‌గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జీవీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకొని మరీ వచ్చి అభిషేకాలు చేస్తున్నారని, ఇంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ శతజయంతి వేళ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించానని చెప్పి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసిన ఆర్జీవీ.. చంద్రబాబుకు తొలి నుంచి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు.
ఇక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జీవీ.. కీలక ఆరోపణలు గుప్పించారు. మీకు ఓ సీరియస్ జోక్ చెప్పడానికి వచ్చాను.. ఎవరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది.. అది ఎంత పెద్ద జోక్ అంటే.. స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు నవ్వాలో, ఏడవాలో తెలియని జోక్.. అల్లుడైన వ్యక్తి రామారావును ఎంత దారుణంగా టార్చర్ చేసి, ఏడిపించి చంపాడో తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆయనే దండులు పట్టుకొని వేయడం పెద్ద జోక్… అని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా చంద్రబాబు టార్గెట్‌గా ఆర్జీవీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో మానసిక క్షోభ పడుతుండగా లక్ష్మీ పార్వతి ఆయనకు సేవ చేసిందని ఆర్జీవీ పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని చాలా మంది అనుకుంటున్నారన్నారు. అయితే, ఆయనకు అవగాహన లేదా? అటువంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారని ఆర్జీవీ సూటిగా ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సందర్భంగానూ విజయవాడకు వచ్చిన ఆర్జీవీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు రాగా.. టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకున్న సంగతి అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభలో ఆయన ప్రసంగించారు. ఎన్టీఆర్‌ను, చంద్రబాబును ఆకాశానికెత్తేసిన రజనీ.. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరువలేనిదని కొనియాడారు. చాలా కాలం తర్వాత జూబ్లీహిల్స్ ప్రాంతానికి వచ్చానని, తాను న్యూయార్క్ నగరంలో ఉన్నానా, హైదరాబాద్‌లో ఉన్నానా తెలియలేదని రజనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా దర్శకుడు ఆర్జీవీ కామెంట్స్ చేశారు. రజనీకాంత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్కన కూర్చుని వాళ్లను పొగిడారని ఆర్జీవీ అన్నారు. రజనీ కూడా ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లేనని ఆర్జీవీ ఆరోపించారు.
ఎన్టీఆర్ ను చంపిన వాళ్ళే ఇప్పుడు ఆయనకు అభిషేకాలు చేస్తున్నారు…RGV 🔥🔥🔥👊👊 pic.twitter.com/nvGKAzEz23
— Radhika (Leo)🦁 (@sweety_00099) May 28, 2023
ఒకే ఒక్క మగాడు ఎన్టీఆర్..
ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆర్జీవీ మాట్లాడారు. నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని రామ్‌గోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. తారక్ ఒక్కడే తాత మీద ఉన్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదని వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాళ్లతో కలవనందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెబుతున్నానంటూ వర్మ పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ నేతలు ఆయన్ను ఆహ్వానించారు.
నందమూరి తారక రామారావు ప్యామిలీ లో ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్
– RGV🔥 pic.twitter.com/0N3S5TYoLZ
— Rahul (@2024YCP) May 28, 2023
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. తన బర్త్ డే వేడుకల్లో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నానంటూ ఆయన సమాచారం ఇచ్చారు. తాజాగా మహానాడుకూ జూనియర్ దూరంగా ఉన్నారు. అంటే టీడీపీ, చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకోవడం జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టం లేదనే అభిప్రాయం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎన్నికల సందర్భంగా సీన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
Read Also : NTR: క్లాస్ అండ్ మాస్.. దంచి కొడుతున్న ఎన్టీఆర్..!