‘కార్తీక దీపం’ సీరియల్‌లో మోనిత పాత్రతో శోభా శెట్టి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన నటనతో మెప్పించింది.

Bigg Boss Telugu 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శోభ.. తన ఆటతీరు, మాటలతో సోషల్ మీడియాలోనూ బాగా చర్చలో నిలిచింది.

తెలుగు బిగ్‌బాస్ తర్వాత Bigg Boss Kannada 11లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దీంతో కన్నడ ప్రేక్షకుల్లోనూ ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.

శోభా శెట్టి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఫ్యాషన్ లుక్స్, ఫొటోషూట్స్‌తో పాటు తన జీవితంలోని విశేషాలను అభిమానులతో పంచుకుంటోంది.

యశ్వంత్‌తో తన రిలేషన్‌షిప్‌ను అభిమానులతో పంచుకున్న శోభ.. ఎంగేజ్‌మెంట్‌తోనూ వార్తల్లో నిలిచింది. ఇద్దరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నాయి.

2026 మేలో శోభా శెట్టి, యశ్వంత్ కలిసి డిజైనర్ స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఎంతోకాలంగా ఎదురుచూసిన కల నిజమైందంటూ ఈ కొత్త ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేసింది.

సీరియల్స్, రియాలిటీ షోలు మాత్రమే కాకుండా ఇప్పుడు ఫ్యాషన్, బిజినెస్ వైపు కూడా అడుగులు వేస్తోంది శోభ. సోషల్ మీడియా క్రేజ్‌ను కొనసాగిస్తూ కెరీర్‌లో కొత్త అవకాశాల వైపు సాగుతోంది.

For More film updates pls follow  Keerthanaa News