కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో బిజీ హీరోయిన్‌గా మారింది. 

రుక్మిణి వసంత్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మే 20న విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌తో పాటు రుక్మిణి వసంత్ కూడా కనిపించింది.

భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాను 2027 జూన్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

రుక్మిణి వసంత్ నటించిన మరో క్రేజీ మూవీ టాక్సిక్. యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణి మెలిస్సా అనే పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా 2026 ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది.

రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1లో నటించిన తర్వాత రుక్మిణి వసంత్‌కు మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత టాక్సిక్, డ్రాగన్ వంటి భారీ ప్రాజెక్టులు ఆమె ఖాతాలో చేరాయి.

ఎక్కువ సినిమాలు చేయడం కంటే మంచి కథలు, ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయడమే ముఖ్యమని రుక్మిణి వసంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

For More Film updates follow  Keerthanaa News