యంగ్ బ్యూటీ రాశి సింగ్ వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫొటోలు, ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులులో వడ్డే నవీన్ సరసన లక్ష్మి పాత్రలో రాశి నటించింది. మేకప్‌కు దూరంగా, ఓ బిడ్డకు తల్లిగా కనిపించడం తనకు కొత్త అనుభవమని తెలిపింది.
రాశి కెరీర్‌లో ‘గాసిప్’ స్పెషల్ మూవీ. తొలిసారి ఫీమేల్ సెంట్రిక్ కథకు లీడ్ చేసింది. చిన్న గాసిప్ ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందనేది ఈ సినిమా ప్రధానాంశం.
గ్లామరస్ రోల్స్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు సిద్ధమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
రాశి సింగ్ వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది. సినిమా జర్నీతో పాటు రెస్టారెంట్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
సినిమాల్లో పాత్రకు తగ్గట్లు డీగ్లామర్ లుక్‌లో కనిపించే రాశి.. బయట మాత్రం ట్రెండీ, గ్లామరస్ ఫ్యాషన్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. కెరీర్‌లో విభిన్న పాత్రలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ బ్యూటీకి రాబోయే ప్రాజెక్టులు మరింత కీలకం కానున్నాయి.