ఇస్మార్ట్ శంకర్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నభా నటేష్.. కొంత గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్నారు.
నభా నటేష్ లేటెస్ట్‌గా నాగబంధం సినిమాలో పార్వతి పాత్రలో కనిపించారు. వేద విద్యార్థిగా ఆమె చేసిన ఈ పాత్ర తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనదని నభా తెలిపారు.
నాగబంధం కోసం భారీ స్థాయిలో తెరకెక్కించిన పాటలో దాదాపు 5 వేల మంది డ్యాన్సర్లు పాల్గొన్నట్లు నభా వెల్లడించారు. ఈ అనుభవం తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ నభా నటేష్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
నభా నటేష్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ స్వయంభు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు భారత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న టైసన్ నాయుడు సినిమాలోనూ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.