బీ టౌన్‌ బ్యూటీ శనయా కపూర్‌ గోల్డెన్‌చాన్స్‌ కొట్టేసింది. స్టార్‌ హీరో, పాన్‌ ఇండియా మూవీలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది.

మలయాళ ప్రముఖ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నంద కిశోర్‌ తీస్తున్న వృషభ మూవీలో శనయా కీ రోల్‌ చేయనుంది.

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌, మహీప్‌ కపూర్‌ల కుమార్తే శనయా కపూర్‌. జాన్వీ కపూర్‌కు కజిన్‌.

శనయాను ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ బెధాదక్‌ చిత్రంతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్‌ చేయనున్నారు. ఈ మూవీ రిలీజ్‌ కాకముందే వృషభలో చాన్స్‌ దక్కింది.

జాన్వీ కపూర్‌ యాక్ట్‌ చేసిన "గుంజన్‌ సక్సేనా.. ది కార్గిల్‌ గర్ల్‌"కు సహాయ దర్శకురాలిగా వర్క్‌ చేసింది. 

శనయా తల్లి మహీప్‌ కపూర్‌ యాక్ట్‌ చేసిన ఫ్యాబులస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైన్స్‌ సిరీస్‌లో గెస్ట్‌ రోల్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ.

యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ కోసం ఏ ఇన్‌స్టిట్యూట్‌కూ వెళ్లలేదట. ఇండస్ట్రీలో వర్క్‌ చేస్తూ నటుల నుంచి నేర్చుకుందట.

శనయాకు అనన్య పాండే, సుహానా ఖాన్‌, నవ్యానంద క్లోజ్‌ ఫ్రెండ్స్‌. తరచూ పార్టీలకు వెళ్తుంటారు.

ఈ భామకు బెల్లీ డ్యాన్స్‌లో ప్రత్యేక నైపుణ్యం ఉంది. సోషల్‌ మీడియాలో వాటిని షేర్‌ చేస్తుంటుంది.

హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా, హీరోల్లో రణ్‌బీర్‌ కపూర్‌ అంటే ఈమె ఇష్టమట.

సినిమా బ్యాగ్రౌండ్‌ ఉండటంతో నెపొటిజమంటూ ఈ భామపై విమర్శలు వచ్చాయి. వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందట.

 సోషల్‌ మీడియాలో శనయాకు భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో 1.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.