Urvasi: అప్సరసల గురించి హిందూ పురాణాల్లో చాలా చోట్ల ప్రస్తావించారు. వీరిలో రంభ, ఊర్వసి, మేనక, తిలోత్తమతో పాటు అనేక మంది అప్సరసలు ఉంటారని చెబుతారు. స్వర్గలోకంలో వీరు దేవతల ఆనందం కోసం నృత్యాలు చేస్తూ ఉంటారని చెబుతారు. దాంతోపాటు రుషులు తపస్సు చేస్తే వాటిని భగ్నం చేయాలని స్వయంగా దేవేంద్రుడు పురమాయిస్తుంటాడని కథల్లో చదివి ఉంటారు. (Urvasi)
ఊర్వసి కంటే రంభ, మేనక సీనియర్లని పురాణాలు చెబుతున్నాయి. ఊర్వసి పుట్టుక గురించి ప్రత్యేకమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం బదరికావనంలో లోకకల్యాణం కోసం నరనారాయణులు ఘోర తపస్సు చేస్తుంటారు. వీరి తపస్సును భగ్నం చేయడానికి యథాలాపంగా ఇంద్రుడు అందగత్తెలను పంపుతాడు. రంభ, మేనక, తిలోత్తమ లాంటి అప్సరసలు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇంద్రుడి గర్వం అణచడానికి నారాయణుడు తన కుడి ఊరువుపై చరిచి ఊర్వసిని పుట్టిస్తాడని పురాణాల్లో చెప్పారు.
ఊరువు నుంచి పుట్టిన ఈమెకు ఊర్వసిగా నామకరణం చేస్తాడు నారాయణనుడు. రంభాది అప్సరసలకంటే రెట్టింపు అందం, ముఖవర్చస్సుతో ఆమె దర్శనమిస్తుంది. ఆమెను దేవేంద్రుడికి పరిచయం చేయాలని నారాయణనుడు ఈ అందగత్తెలకు సూచిస్తాడు. ఇక దేవలోకంలో స్థానం సంపాదించుకున్న ఊర్వసి అందాన్ని ఓ సారి సూర్యుడు, వరుణ దేవుడు గమనిస్తారు. ఆమె అందానికి ముద్ధులైన వీరు ఇద్దరూ.. తేజస్సును విడిచిపెడతారు.
ఈ క్రమంలో వారి తేజస్సును ఊర్వసి కుండలిలో భద్రంగా ఉంచుతుంది. ఇలా ఈ కుండలి లోంచి వశిష్ట, అగస్త్య మహర్షి పుడతారు. ఈ నేపథ్యంలో వరుణుడితో కలిసినందుకు భంగపడిన సూర్యుడు.. ఊర్వసిని భూలోకంలో పురూరవునికి భార్యగా పుట్టాలంటూ శపిస్తాడు. పురూరవుడు చంద్రవంశానికి చెందిన రాజు.
అప్పటికే భూలోకానికి చేరిన ఊర్వసిని చూసి మోహిస్తాడు పురూరవుడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరతాడు. కొన్ని నిబంధనలు పెడుతుంది ఊర్వసి. తనవెంట తెచ్చుకున్న జింక పిల్లలను అపురూపంగా చూసుకోవాలని, తనకు ఎప్పుడూ దిగంబరంగా కనిపించరాదని షరతు పెడుతుంది. వీటిని అతిక్రమిస్తే వెంటనే స్వర్గానికి చేరుకుంటానని చెబుతుంది. తర్వాత వీరిని దేవతలు పన్నాగం పన్ని విడదీస్తారు.
Read Also: Karnataka Temple: ఆ దేవాలయం ఏడాదిలో మూడు రోజులే తెరుచుకుంటుంది..!