స్మార్ట్ యుగంలో సెల్ ఫోన్ (Mobile) లేనిదే ఏ పనీ జరగదంటే అతిశయోక్తి కాదు. మన జీవితంలో సెల్ ఫోన్ (Mobile) నిత్యావసరాల జాబితాలో చేరిపోయింది. స్మార్ట్ ఫోన్లు (Mobile) వచ్చాక విపరీతంగా వాడకం పెరిగిపోయింది. పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. అవసరం లేకున్నా ఏదో ఒకటి నొక్కుతూ సమయం వృధా చేసుకుంటున్నారు. కనీసం తినే సమయంలోనూ కొందరు సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటారు. సెల్ ఫోన్ మాయలో పడి వేళకు తిండి మానేస్తుంటారు.
1. ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూడటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
2. చాలా మంది నిద్ర లేస్తూనే సెల్ ఫోన్ చూస్తూ గడిపేస్తుంటారు. రాత్రి పడుకొనే ముందు కూడా సెల్ ఫోన్ గంటల తరబడి చూడటం, ఉదయం లేవగానే దానిపై టైమ్ స్పెండ్ చేయడం చేస్తుంటారు.
3. ఇలా చేయడం అనేక సమస్యలకు తావిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
4. సెల్ ఫోన్ వెలుగులు రాత్రి పడుకొనే సమయంలోనూ, ఉదయం నిద్ర లేవగానే మన కళ్లపై పడటం ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.
5. సాధ్యమైనంత వరకు ఈ అలవాటు మానుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూడరాదని చెబుతున్నారు.
6. అప్పటిదాకా ప్రశాంతంగా పడుకుని ఉంటారు.. అప్పుడే సెల్ ఫోన్ వెలుగు పడితే కళ్లకు ప్రమాదమట. రోజంతా యాక్టివ్ గా ఉండలేకపోవడానికి ఇది కారణం అవుతుంది.
7. ఉదయాన్నే మొబైల్ చూడటానికి బదులుగా యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం ప్రత్యామ్నాయాలుగా సూచిస్తున్నారు.
8. లేవగానే గోరు వెచ్చటి నీళ్లతో ఫేస్ కడుక్కొని కళ్లను తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.
9. ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. అలా కాదని లేవగానే సెల్ ఫోన్ చూస్తూ ఉండిపోతే అనేక సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. రోజంతా తలనొప్పిగా ఉండటం, కళ్ల జబ్బులు పెరుగుతాయి.
రక్త హీనతతో బాధపడుతున్నారా? పాలలో ఇవి నానబెట్టి తినాలి..
పాలలో ఆరోగ్యకర పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. పాలలో క్యాల్షియం, పొటాషియం, పాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ డీ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇంకా అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. పాలు తీసుకోవడం వల్ల ఎములు పటిష్టంగా తయారవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు దోహదం చేస్తాయి.
1. ఇక ఖర్జూరంలోనూ అనేక పోషక విలువలున్నాయి. పాలతో పాటు ఖర్జూరం కలిపి తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోనాలు సొంతమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
2. రోజూ ఓ గ్లాసు పాలతో పాటు ఖర్జూరం కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి రెండూ బలమైన ఆహారమని చెబుతున్నారు.
3. ముఖ్యంగా ఖర్జూరంలో సెలీనియం, ఫాస్పరస్, ఫ్లోరిన్, జింక్, పొటాషియం, రాగి, తదితరాలు పుష్కలంగా ఉంటాయి.
4. చాలా మందికి రక్త హీనత వేధిస్తూ ఉంటుంది. ఇందుకు పాలు ఖర్జూరంతో విరుగుడు లభిస్తుందని చెబుతున్నారు.
5. ఖర్జూరంలో అనేక విటమిన్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సీ, ఈ, బీ అధికంగా ఉంటాయి.
6. పాలు, ఖర్జూరం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి.
7. ఎముకల సాంద్రత పెరగడానికి దోహదం చేస్తాయి. కండరాల అభివృద్ధి జరుగుతుంది.
8. లైంగిక సామర్థ్యం పెరగాలంటే రాత్రి పూట ఓ గ్లాసు పాలలో ఖర్జూరం కలిపి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
9. ఇలా చేయడం వల్ల స్టామినా పెరిగి శృంగారం బాగా చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
10. శారీరక ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. పాలలో ఖర్జూరాలు నానబెట్టి తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జీ లభిస్తుంది.
11. రక్తహీనత సమస్య నుంచి బయట పడొచ్చు. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
Read Also : Vastu for Money: ఇలా చేస్తే దరిద్రం పోయి.. అదృష్టం కలిసి వస్తుంది