అధిక బరువుతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు వివిధ రకాల టెక్నిక్స్ ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గడం (Weight loss) లేదని వాపోతుంటారు. ఊబకాయం వల్ల చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి సులభంగా వెయిట్ లాస్ (Weight loss) అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. త్వరగా బరువు తగ్గడానికి బెస్ట్ టెక్నిక్ అంటే స్మిమ్మింగ్ అని నిపుణులు చెబుతున్నారు.
1. ఈత కొట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్విమ్మింగ్ వల్ల శరీరం చురుగ్గా తయారవుతుంది.
2. కార్డియో వ్యాయమంగా కూడా స్విమ్మింగ్ ను పిలుస్తారు. జిమ్ కు వెళ్లి పెద్ద పెద్ద బరువులు ఎత్తి కసరత్తులు చేయలేని వారు ఈత కొట్టవచ్చు.
3. కీళ్ల నొప్పులు ఉన్న వారు కూడా స్విమ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
4. ఈత కొడితే మన బాడీలోని మొత్తం అవయవాలన్నీ కదులుతాయి. చేతులు, కాళ్లు కదిలిస్తూ ఈత కొడతాం. దీని కారణంగా శరీరం మొత్తం పని చేయడం మొదలు పెడుతుంది.
5. ఉదరం, చేతులు, కాళ్లు, తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి స్విమ్మింగ్ కు మించిన బెస్ట్ వ్యాయామం ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు.
6. రోజూ ఓ అరగంట ఫ్రీ స్టైల్ లో స్విమ్మింగ్ చేయడం వల్ల దాదాపు 300 కేలరీలు ఖర్చవుతాయి. అదే బటర్ ఫ్లై మోడ్ లో ఈత కొడితే 400 వరకు కేలరీలు ఖర్చు అవుతాయి.
7. స్విమ్మింగ్ లో కూడా వివిధ రకాల పద్ధతులున్నాయి. ఏ పద్ధతిలో చేసినా బాడీలోని కొవ్వును బాగా కరిగిస్తుంది.
8. కేలరీల బర్న్ మనం ఉపయోగించే కండరాలపై ఆధారపడి ఉంటుంది.
Mint Leaves: పుదీనాతో అనారోగ్య సమస్యలు మటుమాయం..
వంటింట్లోని పదార్థాలతో చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. వాటిలో ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఇందులో పుదీనా ఆకు ముఖ్యమైనది. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మంచి ఫ్లేవర్ తో పాటు చాలా సమస్యలను దూరం చేస్తుంది. అనేక రకాల ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి. పుదీనా మన పూర్వీకుల నుంచి ఎన్నో రకాల ఆయుర్వేద మందుల్లోనూ వాడుతున్నారు.
1. పుదీనా ఆకులు మనం వంటల్లో ఎక్కువగా వాడుతుంటాం. పుదీనా చెట్నీ ఎక్కువ మంది చేసుకొని తింటారు.
2. పుదీనా ఆకులను చాలా రకాల కాస్మొటిక్ కంపెనీలు కూడా మందుల తయారీలో వినియోగిస్తాయి.
3. క్రీములు, లోషన్లు, మందుల తయారీలో వాడుతుంటారు. ఇక వంటల విషయానికొస్తే.. చికెన్, మటన్ బిర్యానీలు చేసుకోవాలంటే తప్పనిసరిగా పుదీనా ఉండాల్సిందే. అనేక రకాల శాకాహార వంటల్లోనూ పుదీనాను కలిపితే మంచి రుచి వస్తుంది.
4. ఇంట్లో పరిమళమైన వాసన రావాలంటే తలుపులు డోర్లు మూసివేసి కాసిన్ని పుదీనా ఆకులు ఓ గిన్నెలో వేసి నీరు పోయాలి.
5. ఓ పది నిమిషాల పాటు ఉడకబెట్టి పొగలు వచ్చేటప్పుడు ఇంట్లో అంతా కలియతిప్పితే దుర్గంధం పోయి సువాసనలు వెదజల్లుతాయి.
6. నోట్లో దుర్వాసన వచ్చే వారు కూడా నాలుగు పుదీనా ఆకులు నోట్లో వేసుకొని నమిలితే మంచిది. వాంతులు, వికారంగా అనిపించడం లాంటివి కూడా పుదీనా నివారిస్తుంది.
7. పుదీనా ఆకులతో సాధారణ జబ్బులను నివారించుకోవచ్చు. పుదీనా ఆకులతో బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే దగ్గు వెంటనే తగ్గుముఖం పడుతుంది.
8. ముక్కుదిబ్బడతో బాధపడుతున్న వారు నాలుగు ఆకుల పుదీనా రసం ముక్కులో వేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
Read Also : Sleeping Tips: నిద్రపట్టడానికి మంచి టిప్స్.. ఇలా ప్రయత్నించండి..