Pimples: ప్రపంచవ్యాప్తంగా మొటిమల సమస్య కోట్లాది మందిని వేధిస్తోంది. దీనిపై చాలామందికి అనేక అపోలు ఉన్నాయి. ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అంతేకాకుండా కొందరైతే సమస్యను మరింత జఠిలం చేసుకుంటారు. మొటిమల సమస్య ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు వివరిస్తున్నారు. (Pimples)
చాలామందికి యుక్త వయసులో మొహంపై మొటిమలు ఏర్పడతాయి. కొందరిలో వయసు నిమిత్తం లేకుండా ఈ సమస్య బాధిస్తుంది. ఇవి తగ్గిన తర్వాత కూడా ఒక్కోసారి మచ్చలుగా ఉండిపోతాయి. చర్మ రంధ్రాలు వాపునకు గురి కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మొటిమల సమస్యను పరిష్కరించుకోవచ్చు.
చాలామంది మొటిమల సమస్య ఉన్నప్పుడు వాటిని గిల్లుతారు. అలా చేయడంవల్ల వాపు పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. మచ్చలు కూడా ఏర్పడతాయి. నల్లటి మచ్చల వల్ల మొహం అందవిహీనంగా మారుతుంది. మొటిమలపై టూత్ పేస్ట్ రాసుకోవడం వల్ల నయం అవుతాయని చాలామంది భావిస్తారు. టూత్ పేస్ట్ లోని బేకింగ్ సోడా వంటి పదార్థాలు చర్మాన్ని పొడిబారిలా చేస్తాయి. కానీ టూత్ పేస్ట్ అనేది మొటిమల పరిష్కారం కోసం తయారు చేసింది కాదు. మొటిమలపై టూత్ పేస్ట్ రాసుకోవడం వల్ల ఇరిటేషన్ కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతిని పాటించకపోవడమే ఉత్తమం.
మొటిమల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయి. మొటిమలకు చికిత్స తీసుకోకపోవడం, గిల్లడం కారణంగా మచ్చలు ఏర్పడతాయి. కొన్ని మచ్చలు శాశ్వతంగా ఉండిపోతాయి. సరైన సమయంలో డెర్మటాలజిస్ట్ ను కలసి చికిత్స తీసుకుంటే సమస్యను పరిష్కరించుకోవచ్చు. మచ్చలు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
మొటిమల సమస్య ఎవరికైనా రావచ్చు. కానీ కొంతమంది మొహం ఆయిలీగా ఉంటుంది. అలాంటి వారిని మొటిమల సమస్య ఎక్కువగా భాధిస్తుంది. ఆయిలీ ఫేస్ ఉన్నవారిలో మొటిమల సమస్య ఏర్పడడం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సరైన చర్మ రక్షణ లేకపోవడం వల్ల కూడా మొటిమలు ఏర్పడతాయి. అందుకే చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం తరచుగా ఫేస్ వాష్ చేసుకోవాలి. మరి కొంతమంది అతిగా మొహం కడుక్కుంటూ ఉంటారు. ఇది కూడా సరికాదు. ఇలా చేయడం వల్ల మొటిమలపై రాపిడి పెరుగుతుంది. సమస్య పరిష్కారం కాకపోగా మరింత తీవ్రంగా మారుతుంది. మొటిమలతో బాధపడేవారు చర్మవ్యాధుల నిపుణుల్ని సంప్రదించాలి. వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటిస్తే… మొటిమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
ఇదీ చదవండి: Pregnant Women Bath: గర్భిణులు రోజుకు ఎన్ని సార్లు స్నానం చేయాలి? ఏ పనులు చేస్తే ప్రమాదం?