Periods Pain: కొందరు మహిళలు, యువతులకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన పెయిన్ వస్తుంటుంది. పీరియడ్స్ సైకిల్ రెగ్యులర్‌గానే ఉన్నప్పటికీ కొందరికి ఈ పెయిన్ కాస్త ఎక్కువగా వస్తుంటుంది. ఇందుకు కారణం ఏంటనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం. (Periods Pain)
మహిళలకు పీరియడ్స్ 25-30 రోజుల రెగ్యులర్ సైకిల్‌లో వస్తుంటాయి. కొందరికి వారం పది రోజులు అటూ ఇటూ ఉంటుంది. మరికొందరిలో రెండు మాసాలకు ఓసారి, ఇంకొందరికి మూడు నెలలకు కూడా వస్తుంటాయి. అలాంటి వారు హార్మోన్స్ ఇంబ్యాల్స్ ఉందని గుర్తించి తగిన వైద్యం పొందాలి. ఇక పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నప్పటికీ పెయిన్ విషయంలో తేడా ఉంటుంది. అధికంగా పెయిన్ ఉండటానికి కారణాలు తెలుసుకుందాం.
Read Also : Weight Gain Tips for Women: అమ్మాయిలూ.. వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలా చేయండి..!
ఎదైనా డైజెస్టివ్ సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ సందర్భంగా పెయిన్ ఎక్కువగా వస్తుందని నిపుణులు అంటున్నారు. కాన్స్‌స్టిపేషన్, ఎసిడిటీ, లేదా శరీరంలో ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్ ఉన్న సమయంలో పీరియడ్ పెయిన్ కాస్త ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల సమస్య పరిష్కరించుకోవచ్చని పేర్కొంటున్నారు. పీరియడ్స్ వచ్చే 5 రోజుల ముందు కొన్ని ఆహారాలు తీసుకోకుండా ఉంటే పెయిన్ తగ్గుతుందని నిపునులు అంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి..
1. ఎక్కువ ఆయిల్ కలిగిన ఆహారాలు తీసుకోవద్దు. అంటే నూనెలో వేయించిన ఫుడ్స్.
2. షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఉదాహరణకు చాక్లెట్లు, స్వీట్లు లాంటివి.
3. మైదాతో చేసిన ఫుడ్స్, బిస్కెట్లు, బర్గర్లు లాంటివి.
4. నాన్ వెజ్‌కు దూరంగా ఉండాలి. చికెన్, మటన్, ఫిష్ లాంటివి అవాయిడ్ చేయాలి.
Read Also : Periods: ట్యాంపూన్లు, మెన్‌స్ట్రువల్ కప్‌లను పీరియడ్స్ సమయంలో వాడొచ్చా?
పీరియడ్స్‌కు ముందు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రోస్టాగ్‌లాండిన్స్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టాగ్‌లాండిన్స్ గర్భసంచిని ఎక్కువ కాంట్రాక్షన్ అయ్యేలా చేస్తుందంటున్నారు. అంటే సంకోచాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎప్పుడైతే ఎక్కువ కాంట్రాక్షన్స్ ఉంటాయో పీరియడ్స్ పెయిన్ సివియర్‌గా ఉంటుందని పేర్కొంటున్నారు.
పీరియడ్స సమయంలోగానీ, పీరియడ్స్‌కు ముందు సులభంగా అరిగిపోయే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు.
Read Also : Periods: ఆడవాళ్లు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మగవాళ్లు ఇలాంటి పనులు చేయరాదట.. అవేంటో తెలుసుకోండి..