Mangu Spots: మంగు మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి? పరిష్కార మార్గాలు ఇవీ..

Mangu Spots: మంగు మచ్చలు, ముడతలు ఎలా తగ్గుతాయనే సందేహాలు చాలా మందికి వేధిస్తుంటాయి. నిమ్మకాయలతో వీటికి చక్కటి పరిష్కారం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. (Mangu Spots)

సమాజంలో కొందరు మంగు మచ్చలతో బాధపడుతుంటారు. మంగు మచ్చలు అనేవి చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. ముడతలు ఏర్పడి చూడటానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. వైద్య పరిభాషలో మంగు మచ్చలను మెలస్మా అని కూడా పిలుస్తారు. వీటిని తగ్గించుకోవడానికి చాలా రకాల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. అయితే, ప్రత్యేకించి కొన్ని పద్ధతులు అనుసరిస్తే వీటి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మానవ శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే సమాజంలో అందరి ముందూ ధైర్యంగా, స్వేచ్ఛగా తిరగగలుగుతారు. దాంతోపాటు అగ్రెసివ్‌గా మాట్లాడటం చేయగలుగుతారు. అయితే, శరీరంలో ఏ చిన్న లోపం ఉన్నా లేదా ముఖంపై, చర్మంపై సమస్యలు ఏర్పడినా మానసిక ధైర్యం లోపిస్తుంది. నలుగురిలో కలవాలంటే కాస్త ముభావంగా ఉంటుంది. స్వేచ్ఛగా తిరగలేకపోతుంటారు.

Read Also : Relationship tips for Couple: ఈ 5 అలవాట్లతో మీ బంధాన్ని దెబ్బతీసుకొనే ప్రమాదం..!

సౌందర్యపరమైన ఈ సమస్యకు సులువైన పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఓ లేపనాన్ని తయారు చేసుకోవాలి. ఇందుకు ఎండిన రోజా పూలు అవసరం అవుతాయి. వీటితోపాటు నిమ్మకాయలు తీసుకోవాలి. ఎండిన రోజా పూలను పౌడర్‌గా తయారు చేసుకోవాలి. ఇందులో తగినంత నిమ్మరసం కలుపుకొని తేనెలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లేపన ఔషధాన్ని మంగు మచ్చలపై మర్దన చేసుకోవాలి. ఓ గంట గడిచిన తర్వాత కడిగేసుకోవాలి.

ఇక మంగు మచ్చలు పోగొట్టుకోవడానికి మరో ఔషధం ఉంది. ఔషధ శాలల్లో గ్లిజరిన్‌ దొరుకుతుంటుంది. గ్లిజరిన్‌, రోజ్‌ వాటర్‌, నిమ్మకాయలు సమ భాగాల్లో కలిపి ఔషధంగా తయారు చేసుకోవాలి. దీన్ని రోజూ మంగు మచ్చలపై పూసుకోవడం చేయాలి. తర్వాత ఓ గంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా మంగు మచ్చల బారి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సులభంగా ఈ పదార్థాన్ని తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు.

Read Also : Healthy Food Tips: హీరోయిన్‌లా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఈ ఆహారం ట్రై చేయండి!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles