Vastu tips for Lock Key: తాళం చెవులు ఇంట్లో ఎక్కడ పెడితే మంచిది!

Vastu tips for Lock Key: వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో చాలా వస్తువులు నిర్దేశించిన చోట పెడుతూ ఉంటాం. ఇంట్లోని వస్తువులు, వంట గది, ఫ్రిడ్జ్, ఇతర వస్తువులు ఎక్కడెక్కడ ఉంచుకోవాలో వాస్తు శాస్త్రంలో సూచించారు. ముఖ్యంగా పూజ గది విషయంలోనూ, ఇంట్లో పెట్టుకోవాల్సిన బంగారం, వెండి వస్తువుల విషయంలోనూ కొన్ని ప్రత్యేక సూచనలు చేస్తున్నారు వాస్తు పండితులు. ముఖ్యంగ తాళం చెవులు (Vastu tips for Lock Key) పెట్టే చోటు గురించి కూడా వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

మనలో చాలా మంది ఇళ్లలో తాళం చెవులు వినియోగిస్తుంటారు. వాటిలో బైక్ తాళం, కారు తాళం, బీరువాలు, తలుపులకు సంబంధించిన కీస్ ను ఉంచడానికి కొన్ని ప్రత్యేకమైన స్థావరాలు ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మర్చిపోకుండా ఒకే స్థలంలో చాలా మంది కీస్ ను ఉంచుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తు శాస్ర్తంలో తాళాలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే ఇబ్బందులు వస్తాయట.

ఇంట్లో తాళాలు, తాళం చెవులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో తాళాలను, తాళం చెవులను సరైన దిశలో పెడితే మీ ఇంటికి అదృష్ట తాళాలు తెరవబడతాయని చెబుతున్నారు.

మరోవైపు బెడ్రూమ్ విషయంలోనూ కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. మంచం ఎలాంటి ప్రదేశంలో ఉండాలి. ఏ డైరెక్షన్ లో ఉండాలో వాస్తు శాస్త్రంలో వివరంగా చెప్పారు. లాకర్ రూమ్ విషయంలోనూ అనేక జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాళం చెవులు ఇంట్లో ఎలాంటి ప్రదేశంలో ఉండాలనే సందేహం మనలో చాలా మందికి కలుతూ ఉంటుంది. దీనికి వాస్తు పండితులు సూచనలు చేస్తున్నారు.

ఇంట్లో మనం తాళం చెవులను, తాళాలను పెట్టేటప్పుడు హాల్లో ఉంచరాదని పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి బయట నుంచి వచ్చే కొత్తవారు ఇంట్లోని తాళాలను, తాళం చెవులను చూడడం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అందుకే పొరపాటున కూడా హాల్లో తాళాలను, తాళం చెవులను ఉంచకూడదని వెల్లడిస్తున్నారు.

వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో వాడే ఏరకమైన తాళం వేసినా వాటిని ఇంట్లో ఉండే డ్రాయింగ్ గదిలో పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దాంతో పాటు పూజగదిలో కూడా ఉంచరాదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. మరోవైపు వంట గదిలోనూ ఉంచకూడదట. చెక్కతో చేసిన హ్యాంగర్ ఒకటి తీసుకొని అందులో ఉంచితే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తాళం చెవికి దేవుడి బొమ్మలు అస్సలు ఉండరాదని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే శుభాలు జరుగుతాయని వాస్తు పండితులు పేర్కొంటున్నారు.

చాలామంది ఇంట్లో ఆగ్నేయంలో తాళం చెవులను ఉంచుతుంటారు. వంటగది సమీపంలో పూజా స్థలం దగ్గర తాళం చెవులను పెట్టడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం తాళం చెవులను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటాం కాబట్టి వంటగదికి, పూజ స్థలానికి దగ్గరగా పెట్టడం మంచిది కాదట.

Read Also : Vastu tips for House Clean: ఇంటి శుభ్రతలో వాస్తు టిప్స్‌ పాటిస్తే శుభప్రదం..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles