డయాబెటీస్ (Diabetes) అనేది చాలా ఇబ్బందికర సమస్య. ఈ జబ్బుతో బాధపడేవారి కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా మధుమేహం (Diabetes) ఉన్న వారు ఆహారం తీసుకొనే విషయంలో అనేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. నేటి కాలంలో మధుమేహం (Diabetes) జబ్బు చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా డయాబెటిక్ సోకితే తీపి పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాల్సి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నోరు కట్టేసుకోవాల్సిందే.
1. మధుమేహం లక్షణాలు చాలా ఉన్నాయి. తరచూ మూత్ర విసర్జన, గొంతు పొడిబారడం, దాహం వేయడం, చూపు తగ్గిపోవడం, హఠాత్తుగా బరువు పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
2. ఉన్నట్టుండి బలహీనంగా అయిపోవడం, నీరసించడం, ఆకలి అధికంగా వేస్తుండటం కూడా మధుమేహం లక్షణాలుగా చెబుతారు. వయసుతో పని లేకుండా చాలా మంది మధుమేహం బారిన పడుతుంటారు.
3. డయాబెటిక్ ను అదుపులో ఉంచడానికి ప్రస్తుతం చాలా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మధుమేహం కంట్రోల్ లో ఉంచడానికి చాలా మంది సప్లిమెంట్స్ ను వాడుతున్నారు.
4. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు తీసుకొనే ఆహారం పూర్తిగా ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. తీపి పదార్థాలకు దూరంగా ఉండటం, వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా డయాబెటిక్ ను కంట్రోల్ లో ఉంచడం సాధ్యమవుతుంది.
5. మధుమేహం ఉన్న రోగులు పెరుగు లక్షణంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
6. పెరుగు తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చని సూచిస్తున్నారు.
7. ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నారింజ కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు.
8. పండ్లు, సలాడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఎలక్ట్రోలైట్స్, ఫైబర్ ను తీసుకోవడం ద్వారా డయాబెటిక్ లెవల్స్ ను అదుపులో ఉంచడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ల నొప్పులుంటే ఇలాంటి ఆహారం అస్సలు తీసుకోవద్దు
కీళ్ల నొప్పులు చాలా మందికి వేధిస్తున్న సమస్య. ఎముకలు, కణజాలానికి సంబంధించిన సమస్య కావడంతో వీటి నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఇతర జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారే ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కీళ్ల నొప్పుల సమస్యలో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాదాపు 200 కంటే ఎక్కువే ఆర్థరైటిస్ సమస్యలున్నాయి.
1. వీటిలో ముఖ్యంగా ఆస్టియో, రుమటాయిడ్, యాంకైలోజింగ్ స్పాండైల్, గౌట్, జువెనైల్ ఇడియోఫథిక్ ఆర్థరైటిస్, లూపస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ తదితర సమస్యలు ఉన్నాయి.
2. మనదేశ జనాభాలో దాదాపు 22 నుంచి 39 శాతం మంది ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారని ఎన్సీబీఐ నివేదిక తాజాగా పేర్కొంది. ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలే ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారని తేలింది.
3. ఈ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
4. తద్వారా లక్షణాల తీవ్రత తగ్గించుకోవచ్చు. ఆర్థరైటిస్ పేషెంట్లు ఉప్పు తీసుకోకుంటే మంచిది. అలాగే పెరుగుకు కూడా దూరంగా ఉండాలి.
5. కీళ్ల నొప్పుల సమస్యలున్న వారు మిఠాయిలకు దూరంగా ఉండాలి. స్వీట్లు తింటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది.
6. అలాగే బంగాళాదుంపలు కూడా తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు. ఆలూ తినడం వల్ల కీళ్లలో నొప్పి, వాపు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
7. పాలు కూడా తీసుకోరాదంటున్నారు. అలాగే రెడ్ మీట్ కూడా తీసుకోరాదు. ఇది తింటే కీళ్ల వాపు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.
8. ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. బ్రౌన్ రైస్, క్వినోవా, తృణ ధాన్యాలు తినడం బెటర్.
Read Also : Beauty Sleep: బ్యూటీ స్లీప్.. అమ్మాయిలు ఇలా చేస్తే అందం రెట్టింపవుతుంది..