Gastric problem solutions: నేటి కాలంలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఛాతిలో మంట, తేన్పులు రావడం, కడుపునొప్పి, తిన్నది అరగకపోవడం లాంటివి గ్యాస్ సమస్య ఎక్కువ అవుతోందనడానికి సంకేతాలుగా భావించవచ్చు. అయితే, పుల్లటి పదార్థాలు తినడం వల్ల గ్యాస్ సమస్య మరింత ముదురుతుందని నిపుణులు చెబుతున్నారు. (Gastric problem solutions)
రెగ్యులర్‌గా తినే పప్పు, సాంబార్, చట్నీలు, ఇతర కూరలు చేసుకునే సమయంలో చింత పండు సాధారణంగా వాడుతుంటారు. అయితే, కుటుంబంలో గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు ఇలా చింతపండు వేసిన కూరలు తినడం వల్ల సమస్య ఇంకా తీవ్రతరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చింతపండులో ట్యానల్స్, ఎసిటిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులోకి వెళ్లిన వెంటనే తమపని మొదలు పెడతాయి. కడుపులో మంట అనేది ఇంకా ఎక్కువ అయ్యేలా ఇవి చేస్తాయి.
చర్మ సమస్యలతో బాధపడుతున్నారా ?
చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా పుల్లటి పదార్థాలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వైద్యులు పులపు తినొద్దని చెబుతుంటారు. ఆ పులుపులో చింత పండు కూడా ఒకటని గుర్తు చేస్తున్నారు. స్కిన్ సమస్యలంటే.. సోరియాసిస్, ఎగ్జిమా, ఎలర్జీ, అర్టికేరియా లాంటి సమస్యలున్న వారు ఈ పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలి.
అమ్మాయిలకు ఎవరికైతే పీరియడ్ సమయంలో నొప్పిగా ఉంటుందో వారు కూడా చింత పండు వేసిన కూరలు అవాయిడ్ చేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పీరియడ్ టైమ్‌లో చింతపండుతో చేసిన వంటలు తినడం వల్ల పెయిన్ మరింత పెరుగుతుందని, వీలైనంత వరకు తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Tomato Pulusu: రాచిప్పలో టమాటా పులుసు.. ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..!
Asthma Treatment: ఆస్తమాకు ఆయుర్వేదంలో చికిత్స.. ఉపశమనం లభిస్తుందిలా..!
Belly Fat: బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని విసిగిస్తోందా? ఇలా చేస్తే వెంటనే మటుమాయం ఖాయం..
Heart Attack: గుండె పోటు వస్తుందనే ముందు ఈ లక్షణం కనిపిస్తుంది.. జాగ్రత్త చర్యలివే..