Ear problems: చెవినొప్పితోచాలా మంది బాధపడుతుంటారు. అది ఎలాంటి నొప్పి అనేది మొదట చాలా మందికి తెలియదు. చెవులకు చాలా రకాల ఇన్ఫెక్షన్లు రావడం సహజమే. కొన్ని వాటంతటవే తగ్గిపోతాయి. మరికొన్నింటికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదకరంగా మారుతాయి. చెవికి వచ్చే ఇన్ఫెక్షన్ల లక్షణాలు, కారణాలు ఏంటనేది అందరూ తెలుసుకోవాలి. (Ear problems)
చెవి మధ్య భాగంలో నీరు పేరుకుపోవడం, జలుబు, ఫ్లూ కారణంగా కూడా చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తీవ్రమైన జలుబు కారణంగా చాలామందికి ఒక్కోసారి ముక్కు మూసుకుపోతుంది. అప్పుడు కూడా చెవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు చలికాలంలో ఎక్కువమందికి వస్తుంది. అందువల్ల చెవి ఇన్ఫెక్షన్స్ కూడా చలికాలంలోనే ఎక్కువ. (Ear problems)
చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లను… మెడికల్ టెర్మినాలజీలో అక్యూట్ ఓటీటీస్ మీడియా అని అంటారు. చెవి నొప్పి ఎక్కువ రోజులు ఉందంటే అది ఇన్ఫెక్షన్ గా భావించాలి. మరి గుర్తించడం ఎలా అనుకుంటున్నారా…? చెవిలో ఏదో భారంగా అనిపించడం… నీరు, చీము, రక్తం కారడం.. నొప్పిగా ఉండడం.. చెవి ఇన్ఫెక్షన్ లక్షణాలు. చెవికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నొప్పి కారణంగా నిద్ర పట్టదు. సాధారణంగా మధ్య చెవికి వచ్చి ఇన్ఫెక్షన్లకు.. బ్యాక్టీరియా, వైరస్ కారణం.
చెవిలో మూడు భాగాలు ఉంటాయి. బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. ఈ మూడు భాగాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కడైనా రావొచ్చు. బయటి చెవిలో సాధారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. మధ్య చెవిలో కూడా ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో ఎక్కువ వస్తుంది. ఇక లోపలి చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కు… బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ కారణం అవుతాయి. ఇది సీరియస్ ప్రాబ్లమ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లోపలి చెవికి దగ్గరగా మెదడు భాగాలు ఉంటాయి.
చెవి ఇన్ఫెక్షన్ కారణంగా ఒక్కోసారి గూబకు రంధ్రం పడే ప్రమాదం ఉంటుంది. అప్పుడు పరిస్థితిని బట్టి వైద్యులు సర్జరీని రిఫర్ చేస్తారు. చెవి ఇన్ఫెక్షన్ కారణంగా ఒక్కోసారి మెనింజైటిస్, ఫేషియల్ పెరాలసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి చెవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి పరిస్థితి తీవ్రతను పరీక్షల ద్వారా గుర్తించాలి. తగిన చికిత్స తీసుకోవాలి.
చెవి ఇన్ఫెక్షన్లు సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లకు ప్రమాదం కలిగించవచ్చు. ఇందుకోసం కొన్ని వారాలపాటు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఐవీ ఫ్లూయిడ్స్, ఓరల్ మెడిసిన్ ద్వారా వైద్యులు నయం చేస్తారు. చిన్నపిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్లు ప్రమాదకరం. చిన్నపిల్లలు పడుకొని పాల పీక ద్వారా పాలు తాగితే చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్నపిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు.. ఏడాది పాటు తల్లిపాలు మాత్రమే అందించాలి. తల్లిపాలు అందుబాటులో లేని పక్షంలో డబ్బా పాలను కూర్చుని తాగేలా జాగ్రత్త వహించాలి. పిల్లలు ఉండే గదిలో తాజాగా గాలి ఆడేలా చూసుకోవాలి.
చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
పిల్లలు ఏవైనా మురికిగా ఉన్న వస్తువులను ముట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు చేతుల్ని చెవుల్లో, నోటిలో పెట్టుకుంటారు. కాబట్టి పిల్లల చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులు కూడా ఈ జాగ్రత్త పాటించాలి. పిల్లల్లో జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు… రెండేళ్లలోపు చిన్నారులకు జ్వరం ఒకట్రెండు రోజులకు మించి ఉన్నప్పుడు కూడా చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే ఆకాశం ఉంటుంది. చాలా వరకు ఇన్ఫెక్షన్లు ప్రమాదకరం కాదు. కానీ అప్రమత్తత అవసరం. కొంతమంది అయితే చెవి నొప్పికి తమకు తెలిసిన చిట్కాలు పాటిస్తారు. అది చాలా డేంజర్. అందుకే చెవి నొప్పి ఉన్నప్పుడు ఈఎన్టీ డాక్టరును సంప్రదించాలి.
ఇదీ చదవండి: Health Care tip: రాత్రిపూట ఇవి తింటే పీడ కలలే.. సుఖమైన నిద్రకు టిప్స్ ఇవీ..