Slavery: బానిసత్వానికి అలవాటు పడిన వారిని సమాజంలో చాలా మందిని చూస్తుంటాం. యజమాని చెప్పినట్లు చేయడం ఇలాంటి వారికి అలవాటైపోయి ఉంటుంది. తనకు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ ఇలాంటి వారు బానిసత్వంతో ఊడిగం చేస్తుంటారు. అలాంటి వారికి సంబంధించినదే ఈ కథ. (Slavery)
ఓ వేటగాడు డేగను బానిసగా చేసుకొనేందుకు ఓ ప్రణాళిక వేస్తాడు. డేగ పిల్లను తీసుకొచ్చి పెంచుకుంటాడు. ఆ డేగకు ఎలాంటి శిక్షణ ఇస్తాడంటే.. తనకు బానిసగా ఉండిపోయేంతగా చేస్తాడు. ఆ డేగ ఎగురుకుంటూ వెళ్లి ఆకాశంలో అల్లంత దూరాన వెళ్తున్న చిన్నపక్షులను వేటాడేలా శిక్షణ ఇస్తాడు. ఇలా వేటాడి ఆ చిన్న పక్షిని పట్టుకొని యజమానికి ఇచ్చేలా డేగకు శిక్షణ ఇస్తాడు.
అమాయకత్వంతో కూడిన బానిసత్వం
డేగకు శిక్షణ ఇచ్చే క్రమంలో దాన్ని బాగా మచ్చిక చేసుకుంటాడు వేటగాడు. ఇలా చేసే క్రమంలో పైకి ఎగరగానే స్వేచ్ఛావాయువులు వచ్చాయి అనే సంగతి డేగకు తెలియకుండా చేస్తాడు. అది అమాయకత్వంతో యజమాని చెప్పినట్లే చేస్తుంది. పక్షిని వేటాడే క్రమంలో పక్షితోపాటు ఎగిరిపోయి బానిస సంకెళ్లు తెంచుకుందామనే ఆలోచన ఆ డేగకు రాదు. దానికి అలాంటి థాటే రాదు. బానిసత్వం అంటే ఇలా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.
మాటిమాటికీ ఆకాశానికి ఎగిరి ఓ పావురాన్నో, పిట్టనో దేన్నో ఒకదాన్ని పట్టుకొని వేటగాడికి ఇస్తుంటుంది. అయితే, వేటగాడు తనను వదిలేశాడని, పైకి ఎగిరిపోయి మరో చోటకు వెళ్లి హాయిగా బతకొచ్చనే ఆలోచన దీనికి రాదు. బానిసత్వానికి అలవాటు పడిన వారు అలాగే ఉంటారు. పక్షిని పట్టుకొని వచ్చి వేటగాడికి ఇచ్చేస్తుంది.
మళ్లీ డేగకు నాలుగు జీడిపప్పు గింజలు, వడ్ల గింజలు, వేరుశనగ పలుకులు పెట్టి మేపుతాడు. ఇలా ఒక పక్షిని వేటాడటానికి మరో డేగను వాడటం, ఆ డేగ బానిసత్వానికి అలవాటు పడుతుంది. నిజజీవితంలోనూ ఇంతే.. ఒకరిని వేటాడాటనికి మరొకరిని వాడుతుంటారు. ఇలా చేసే క్రమంలో తాము బానిసలం అయిపోతున్నామని తెలుసుకోలేని అజ్ఞానులు లోకంలో కోకొల్లలు.
ఇదీ చదవండి: Telangana Congress CM: ఆ కుర్చీ నాది రా బై.. తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి క్యాండేట్ల లిస్టు ఇదీ..!