Coconut facts: కొబ్బరి చాలా ప్రయోజనకరమైనది. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరితో ప్రయోజనాలతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి చాలా లాభాలు ఉన్నాయి. కొబ్బరి ముక్కలు, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె.. ఇలా కొబ్బరి ద్వారా బహుళ ప్రయోజనాలు ద్వారా కలుగుతాయి. కొబ్బరి ముక్కలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కొబ్బరి నీళ్ళు ఎంత శ్రేష్టమైనయో మనందరికీ తెలిసిందే. కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకోవడానికి మాత్రమే కాకుండా కొందరు వంట నూనెగా కూడా వినియోగిస్తారు. (Coconut facts)
లాభాలేంటి?
కొబ్బరి తినడం వల్ల బరువు తగ్గుతారు. కొబ్బరిలో ట్రై గ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతాయి. ఒంట్లోని అధిక కొవ్వు కరగడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొబ్బరిలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండేందుకు కార్బోహైడ్రేట్ జీర్ణం కావడంలోనూ మాంగనీస్ కీలకంగా నిలుస్తుంది. కొబ్బరిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫైబర్, ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ షుకర్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.
కొబ్బరి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. కొబ్బరి శరీరానికి చల్లదనం కూడా ఇస్తుంది.
కొబ్బరిలో ఎక్కువ కాలరీలు ఉంటాయి. కాబట్టి తక్కువ మోతాదులో తినాలి. కొబ్బరి నూనె కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ట్రై గ్లిజరైడ్స్ కాబట్టి త్వరగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లు కొబ్బరి నీళ్లు తాగాలి. ఇందులో తక్కువ కాలరీలు ఉంటాయి. జ్యూస్, సోడాకు బదులుగా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
కొబ్బరితో సైడ్ ఎఫెక్ట్స్
కొబ్బరి కొందరికి ఎలర్జీ కలిగించవచ్చు. కొందరికి కొబ్బరి నూనె, పూత వల్ల ఎలర్జీ వస్తుంది. కొబ్బరిని ఎక్కువగా తింటే బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల తీవ్రమైన గుండె జబ్బులు వస్తాయి. డైట్‌లో ఉన్న కొందరికి ట్రెయినర్లు సాట్యురేటెడ్ ఫ్యాట్స్(సంతృప్త కొవ్వులు) తీసుకోవద్దని సూచిస్తారు. అలాంటి వాళ్ల కొబ్బరి నూనెను అవాయిడ్ చేస్తే బెటర్. కొబ్బరి వల్ల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా… అవి అందరికీ కాదు. ఎలా చూసుకున్నా… కొబ్బరి చాలా ఉత్తమమైన ఆహారం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవీ..