Cholesterol control: కొవ్వును కరిగించే చిట్కాలు కావాలా? ఇది మీకోసమే..

మన శరీరంలో కొలెస్ట్రాల్ (Cholesterol control) మామూలు స్థాయిలో ఉంటే ప్రమాదం లేదు. అయితే, మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మనకు తెలియకుండానే కొలెస్ట్రాల్ (Cholesterol control) శాతం పెరిగిపోతుంది. అది ఎలాంటి సగ్నల్స్ లేకుండానే మన శరీరాన్ని డ్యామేజీ చేసేస్తుంది. మనకు ఏ గుండెజబ్బు లాంటిదో వచ్చినప్పుడు మాత్రమే కొలెస్ట్రాల్ ఎక్కువైందని తెలుస్తుంది. అధిక కొవ్వు శాతం మన ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అలాంటి కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం చాలా కష్టమైన పని అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం పత్పనిసరి.

1. బాడీలో కొవ్వు శాతం ఎక్కువైతే కొన్ని లక్షణాలు మనకు తెలిసిపోతాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల హై బీపీ వస్తుంది. కరోనరీ హార్ట్ డిసీజ్ కూడా సోకే ప్రమాదం ఉంది.

2. గుండె పోటు, పెరిపెరల్ వాస్కులర్ వ్యాధులు వస్తాయి. ఇది డయాబెటిస్ తో ముడి పడి ఉంటుంది.

3. మరి ఇంతటి ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ శాతాన్ని సరైన సమయానికి గుర్తించడం అవసరమని గుండె నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4. రక్తంలో కొవ్వు ఉందని గుర్తించాక దాన్ని అనేక మార్గాల ద్వారా తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

5. అధిక కొవ్వును కరిగించి సాధారణ స్థితికి చేర్చడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. జీవనశైలి మార్పులు, బరువుపై నియంత్రణ అనేవి కొలెస్ట్రాల్ స్థాయిలను డిసైడ్ చేస్తాయి.

6. ముఖ్యంగా తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వ్యాధులు దరిచేరకూడదంటే నియంత్రణ పాటించాలి.

7. చెడు కొవ్వును పెంచే ఆహార పదార్థాలను కచ్చితంగా తప్పించాలి. ఫాస్ట్ ఫుడ్ ను వీలైనంత మేర తగ్గించాలి.

8. ఇంట్లో తాజాగా వండుకున్న పదార్థాలైతే బెటర్. ఆకుకూరలు గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తాయి.

9. బీన్స్, బెండ, వెజిటబుల్ ఆయిల్స్, ఓట్స్, పండ్లు తీసుకోవాలి. తగిన వ్యాయామం కూడా ఉండాలి. ఎన్నిసార్లు జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేదనుకున్నప్పుడు త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.

10. వీలైనంత వరకు సిగరెట్, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిది. రోజులో కొంత సమయం కుటుంబంతో సరదాగా గడపడం నేర్చుకోవాలి.

11. రోజులో కాసేపైనా నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.

లివర్ ఫ్యాట్‌ను కరిగించడం ఎలా.. తెలుసుకోండిలా..!

12. లివర్ ఫ్యాట్ సమస్య చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా ఆల్కహాల్ అలవాటున్న వారికి లివర్ సమస్యలు రావడం కామన్.

13. కానీ మందు తాగని వారికి కూడా ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అవి గుర్తించే లోపే చాలా వరకు లివర్ దెబ్బతిని ఉంటుంది.

14. భారత్ లో 9 శాతం నుంచి 32 శాతం మంది ఈ ఫ్యాటీ లివర్ జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని అంచనా. మరి దీన్ని నివారించాలంటే ఏం చేయాలి?

15. సాధారణంగా లివర్ లో కొవ్వు పరిమిత స్థాయిలో ఉంటే ప్రమాదమేమీ ఉండదు. కానీ, పరిమితి మించితేనే అన్ని చిక్కులు వస్తాయి. లివర్ దెబ్బతింటుంది.

16. లివర్ బరువులో కొవ్వు 5 నుంచి 10 శాతం మించరాదు. ఈ పరిమితి దాటితే స్టీటోసిస్ బారిన పడతారు. అదనపు కొవ్వు పేరుకుపోతే హెపాటిక్ స్టీటోసిస్ అని పిలుస్తారు.

17. వీటి లక్షణాలు బయటకు కనిపించకపోవడం మనకు పెద్ద మైనస్. అందుచేత రోగాన్ని గుర్తించడం అంత త్వరగా జరగదు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

18. ఈ ఫ్యాటీ లివర్ సమస్యకు దూరంగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాద కారకాలను నియంత్రించాలి. ముఖ్యంగా నిద్ర అలవాట్లు మార్చుకోవాలని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

19. ఎన్సీబీఐలో ప్రచురితమైన ఓ నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. చెడు ఆహార అలవాట్ల వల్లనే ఈ ఫ్యాటీ లివర్ సమస్యలొస్తాయని నివేదిక తేల్చింది.

20. సరిగా నిద్రపోకున్నా, పగటిపూట ఎక్కువ పడుకున్నా ఈ సమస్యలు అధికంగా వస్తాయని చెప్పింది.

21. తగినంత నిద్ర ఉంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని తెలిపింది. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం ప్రధానమని పేర్కొంది. నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవద్దని నివేదిక సూచించింది.

22. బెడ్ రూమ్ లో ప్రశాంతత ఉండేలా చూసుకోవాలంది. అప్పుడే నిద్ర హాయిగా పడుతుందని తెలిపింది. రోజూ కొంత వ్యాయామం చేయాలని, పడుకొనే ముందు ఫోన్లు పక్కన పెట్టేయాలని హెచ్చరించింది.

Read Also : Health tips: తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఫుడ్‌ కోసం ఇలా చేయండి..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles