Black Salt: ప్రస్తుతం ఉప్పుకు బదులుగా అనేక ప్రత్యామ్నాయాలు వచ్చాయి. అయితే, బీపీ సమస్యలున్న వారు రెగ్యులర్ సాల్ట్‌కు బదులుగా నల్ల ఉప్పును వాడితే మంచిదట. నల్ల ఉప్పు వల్ల వంటల్లో రుచి ఏ మాత్రం మారదు. ఉప్పు తిన్న ఫీలింగ్‌లో కూడా మార్పు రాదట. బీపీ నియంత్రణలోకి రావాలంటే బ్లాక్ సాల్ట్‌ను ప్రిఫర్ చేయాలని చెబుతున్నారు. హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పును వాడితే ఆ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. (Black Salt)
సాధారణంగా అన్ని కూరల్లో ఉప్పు లేనిదే మనం తినలేం. అయోడైజ్డ్ సాల్ట్ పేరిట ప్రస్తుతం మార్కట్లో అనేక రకాల బ్రాండ్‌లకు చెందిన సాల్ట్ అందుబాటులో ఉంది. దీంతోపాటు కొన్ని రకాల కూరలు, పచ్చళ్లలో రాళ్ల ఉప్పును వినియోగిస్తారు. అయితే, సాల్ట్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని డాక్టర్లు, ఆయుర్వేద నిపుణులు, హెల్త్ ఎక్స్‌పర్టులు చెబుతూనే ఉంటారు. కానీ ఉప్పు వినియోగాన్నిమాత్రం ఎవరూ తగ్గించలేకపోతున్నారు. ఎందుకంటే ఉప్పు లేనిదే చప్పగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ప్రత్యమ్నాయ మార్గాల వైపు మళ్లడంపై చాలా మంది ఆసక్తి కనబర్చడం లేదు.
నల్ల ఉప్పు వాడటం వల్ల రక్తం పలుచగా కూడా మారుతుందని చెబుతున్నారు. దీని వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటు లాంటివి రాకుండా ఉంటాయట. నల్ల ఉప్పును తినడం వల్ల ఐరన్ తగిన మోతాదులో శరీరానికి అందుతుంది. దీని వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
షుగర్ లెవల్స్ కంట్రోల్..
నల్ల ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ సాల్ట్ వాడకంతో డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని చెబుతున్నారు. అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయట. శరీరంలోని ఎముకలు దృఢంగా మారుతాయని సూచిస్తున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు బ్లాక్ సాల్ట్‌ను వాడితే చక్కటి నిద్ర పడుతుందట. దాంతోపాటు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
Read Also : Salt uses in daily life: నిత్యజీవితంలో ఉప్పు ఎంత వాడుతున్నారు? మోతాదు మించితే ఏమవుతుంది?