Asthma Problem: ఆస్తమా ఉందా? పడుకొనే ముందు తేనెతో ఇలా చేస్తే మంచి ఫలితాలు

ఆస్తమా (Asthma Problem) ఉన్న వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. ప్రమాదకర జబ్బులూ సోకే అవకాశం ఉంటుంది. వీరి కోసం కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది యాపిల్. రోజూ ఓ యాపిల్ ను తింటుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాపిల్ లో విటమిన్ సి, ఇ ఉంటాయి. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే శక్తి యాపిల్ కు ఉంది. ఆస్తమా (Asthma Problem) రోగులు రోజుకొక యాపిల్ తింటే మంచి ఫలితాలు పొందవచ్చు.

1. ఆస్తమా జబ్బు ఉన్న వ్యక్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దీర్ఘకాలం మనికిషి ఊపిరి అందకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది.

2. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ జబ్బు ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని రకాల పదార్థాలను తినకుండా ఉంటే.. వారికి ఊపిరి ఆడకుండా ఉండే సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

3. ఉబ్బసం వ్యాధిని పూర్తిగా తగ్గించలేకపోయినా కనీసం నియంత్రణలో ఉంచుకోవచ్చు.

4. ఊపిరితిత్తుల వ్యాధులను నివారించడంలో దోహదపడే పదార్థాల్లో అల్లం కూడా ఉంది. ఆస్తమా రోగులు తీసుకొనే ఆహారంలో క్రమం తప్పకుండా అల్లం ఉండేలా చూసుకుంటే మంచిది.

5. అలా వీలు కాకపోతే అల్లాన్ని నీటిలో మరిగించి తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. అలాగే వెల్లుల్లి కూడా ఉబ్బసం రోగులకు దివ్యౌషధం.
6. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు మేలు చేస్తాయి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఓ గ్లాసు నీటిలో కలిపి రోజుకోసారి తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

7. పసుపు ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. ఆస్తమా రోగులకూ ఇది పరమౌషధం. కర్కుమిన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సకల రోగాలనూ పారదోలుతాయి.

8. బచ్చలి కూర, తేనె, ఉసిరి కాయ కూడా ఆస్తమా రోగులు తీసుకోవాలి. ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ పడుకొనే ముందు ఓ టీ స్పూన్ తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే శ్లేష్మాన్ని తొలగిస్తుంది.

ఆస్తమాకు చికిత్స

9. ఆస్తమాను నయం చేయలేం కాబట్టి, ఉబ్బసం చికిత్స కోసం వైద్య పరిభాషలో కొన్ని సూచనలు పాటించాలి.

10. ఆస్తమా లక్షణాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ట్రిగ్గర్ కారకాలను తగ్గించాలి.

11. సాధారణ ఊపిరితిత్తుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.

12. వైద్యులు సూచించిన మందులను వాడుతూ డైట్‌ తప్పనిసరిగా ఫాలో కావాలి.

13. ఆస్తమా చికిత్సలో సాధారణంగా దీర్ఘకాలిక మందులు, ప్రథమ చికిత్స లేదా శీఘ్ర-ఉపశమనం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, ఇంటి వైద్యం ఉంటాయి.

14. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉపయోగపడతాయి. పలు కారణాల వల్ల కండరాలు వాచిపోవడంతో నాళాలు సన్నగా అయిపోతాయి.

15. గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడినప్పుడు గాలి స్పీడ్ గా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా  అవుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా సౌండ్ వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది.

16. ఈ రుగ్మత ఏ వయసు వారికైనా వస్తుంది. అయితే, చిన్నపిల్లలు, యుక్త వయసు వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి.

17. భారత్‌లో 5 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో 5 శాతం నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా కాలం కిందటే చెప్పింది.

Read Also : Health tips: తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఫుడ్‌ కోసం ఇలా చేయండి..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles