Ashwagandha: అశ్వం అంటే గుర్రం. గంధ అంటే వాసన అని అర్థం. గుర్రం దగ్గర ఎలాంటి వాసన వస్తుందో ఈ అశ్వగంధ మొక్క వేరు దగ్గర కూడా అలాంటి పరిమళం వస్తుంది కాబట్టి మహర్షులు దీనికి అశ్వగంధ అని పేరు పెట్టారు. అశ్వగంధకు శారీరకంగా, మానసికంగా బలాన్నిచ్చే గుణం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. సంస్కృతంలో దీనికి బలద అనే పేరు కూడా ఉందని చెబుతున్నారు. అశ్వగంధకు ఇంకా అనేక రకాల పేర్లు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. (Ashwagandha)
ఆయుర్వేదం అత్యంత ప్రాచీనమైనది. పూర్వం మహర్షులు దీన్ని మనకు అందించారు. తర్వాతి కాలంలోనూ ఆయుర్వేదం మానవాళికి ఎంతగానో తోడ్పడుతోంది. ఇందులో అశ్వగంధ అనేది ముఖ్యమైనది. అశ్వగంధ ఓ చెట్టుకు సంబంధించిన వేరు. అశ్వగంధను వృక్ష శాస్త్ర రీత్యా విథానియా సోమిసెరా అని చెబుతారు. ఇండియన్ జింన్‌సింగ్ అని, వింటర్ చెర్రీ అనే పేర్లతో కూడా అశ్వగంధను పిలుస్తారు. అశ్వగంధలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మహర్షులు చెబుతారు.
తెల్లమచ్చలతో బాధపడుతున్న వారు అశ్వగంధను వాడితే త్వరితగతిన నివారణ అవుతుందని చెబుతున్నారు. క్షయ రోగాన్ని తగ్గించే అత్యద్భుతమైన శక్తి అశ్వగంధ మొక్క వేర్లలో ఉందని మహర్షులు చెప్పారు. తెలుగులో కొన్ని చోట్ల పెన్నేరు గడ్డలు, బొమ్మడోలు గడ్డలు అని పిలుస్తూ ఉంటారు. అశ్వగంధను ఉద్దేశించి మన పూర్వీకులు పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అనే నానుడిని ప్రచారంలోకి తెచ్చారని చెబుతున్నారు.
సమస్త వ్యాధులనూ నయం చేసే శక్తి ఉందట..
శుద్ధి చేసి అశ్వగంధ మొక్క వేరును ఉపయోగించుకోవడం ద్వారా ఎలాంటి వ్యాధినైనా పారదోలవచ్చని పెద్దలు చెబుతున్నారు. పావు కిలో అశ్వగంధ వేర్లను తీసుకొని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత అవి మునిగిపోయేంత పాలు ఓ గిన్నెలో పోసి సన్నటి మంటపై పాలు ఇగిరిపోయేంత వరకు చేయాలి. తర్వాత అశ్వగంధ వేర్లను తీసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని వాడటం వల్ల ఎలాంటి జబ్బు అయినా తగ్గిపోతుందని పెద్దలు చెబుతున్నారు.