వాస్తు (House Vastu) నియమాలు, నిబంధనలు పాటించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంటి వాస్తు, స్థలం వాస్తు చూసుకొని కొనుగోలు చేసే వారు చాలా మంది ఉంటారు. ఇంట్లో, లేదా ఓపెస్ స్థలంలో ఖాళీగా ఎంత శాతం ఉంచాలనేది ముఖ్యమైన అంశం. ఇల్లు (House Vastu), భవనంలో గాలి, వెలుతురు బాగా రావడం ముఖ్యం. వెలుతురు బాగా ప్రసరిస్తే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సానుకూల శక్తిని పెంపొందించడం కోసం ఇంట్లో ఖాళీ స్థలం ఎక్కడ ఉండాలనేది వాస్తు పండితులు చెబుతున్నారు. కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో సంపద, శ్రేయస్సు, సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని చెబుతున్నారు.
1. తూర్పు, ఉత్తర దిశ, ఈశాన్యం.. వీటిలో ఈశాన్యంలోని స్థలాన్ని ఇంట్లో తెరిచి ఉంచాలట. దీని వల్ల ఇంటిల్లిపాదికీ మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
2. అలాగే వరండా, బాల్కనీ, పోర్టికో, టెర్రస్, ఇంటి భవనాన్ని ఈశాన్యంలో ఉంచాలట. వరండా, బాల్కనీ, పోర్టికో, టెర్రస్ ఇవి ఖాళీ స్థలం కిందకొస్తాయి.
3. రెండు ఫ్లోర్లు కలిగిన ఇల్లు ఉంటే దాని ఎత్తు తూర్పు, ఉత్తరం వైపు ఉండాలట. ఇంటి పైకప్పు తూర్పు, ఉత్తర దిశలో తెరవాలని వాస్తు శాస్త్రం ప్రకారం చెబుతున్నారు.
4. తూర్పు, ఉత్తరం వైపు కిటికీలు, తలుపులు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. అయితే, తలుపులు, కిటికీల సంఖ్య సమానంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలట.
5. తలుపులు, కిటికీల సంఖ్య 0తో ముగియరాదు. ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. ఇంట్లోని కేంద్రం, మధ్య ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని పిలుస్తారు. ఇది తెరిచి ఉండాలట.
6. ఈ స్థానాన్ని మధ్యలో చతురస్త్రాకారంలో లేదా ప్రాంగణంలో ఉంచి తేలికగా ఉంచాలట. బ్రహ్మ స్థానంలో బరువైన వస్తువులు పెట్టకూడదని చెబుతున్నారు. కిటికీలు, తలుపులు తూర్పు, ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలట.
Mental Health Vastu Tips: మానసిక, శారీరక బలం కోసం ఇంట్లో ఇవి పాటించండి..
1. ఇంట్లో, ఆఫీసులో, వ్యాపార స్థలంలో మనసు ప్రశాంతంగా ఉండాలన్నా వాస్తు శాస్త్రంలో కొన్ని ఆచరించదగ్గ విషయాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం కోసం ఇంటి వాస్తు ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2. ఇంట్లో వాస్తు దోషాలుంటే మనసుపై ప్రభావం చూపడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే చాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా వాస్తు పరంగా మంచి విషయాలు ఆచరిస్తే సరిపోతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
3. చాలా మంది ఉదయం లేవగానే యోగా, ధ్యానం లాంటివి చేస్తుంటారు. కొందరు జిమ్ కు వెళ్లి కసరత్తులు కూడా చేస్తుంటారు.
4. ఇంట్లో యోగా చేసే వారు రోజూ ఉదయం ఇంటి ముందు తూర్పు దిక్కున ఈశాన్యం వైపు చూస్తూ యోగా లేదా ధ్యానం చేస్తే ఆరోగ్యానికి మంచిదట.
5. త్వరితగతిన సానుకూల ఫలితాలు చూస్తారట. ఉదయం సూర్య కిరణాలు మన దేహానికి మంచి చేస్తాయి. ఈశాన్యం వైపు చూసి యోగా చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
6. అలాగే ఈశాన్య దిక్కులో పూజ చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఆరోగ్యం, ఆహ్లాదం దొరుకుతాయి.
7. లేత రంగులు వాడితే మంచి ఫలితాలు వస్తాయట. డార్క్ కలర్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయని చెబుతున్నారు. మానసిక ప్రశాంతత ఉండాలంటే తేలికపాటి లేత రంగులు బెటర్ అంటున్నారు.
8. ఇంట్లో కుర్చీలు, కర్టన్లు, బెడ్ షీట్లు లాంటి వాటికి కూడా లైట్ కలర్స్ ఉంటే మంచి ఫలితాలు వస్తాయట.
9. వాయువ్య దిశలో ఇంటి యజమాని ఫొటో, లేదా ఫ్యామిలీ ఫొటో ఉంటే మంచిదట. ఫొటోలోని వారు చిరుదరహాసం చేస్తుంటే ఇంకా మంచిది. ఇంట్లో ఎవరైనా ట్యాబ్లెట్స్ లేదా మెడికల్ మందులు వాడుతుంటే అలాంటివన్నీ ఈశాన్య దిక్కులో ఉంచుకోవాలని చెబుతున్నారు.
10. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచుకోరాదు. వినియోగించనివి, రిపేర్లు ఉన్న వాటిని వీలైంత త్వరగా వదిలించుకుంటే ఇంట్లో అందరికీ మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Read Also : Evening things: లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి?