Indraja: ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ (Indraja) ప్రస్తుతం ఈటీవీ షోల్లో పాల్గొంటూ మరోసారి తన సత్తా చాటుతున్నారు. ఆమె చెన్నైలోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఇంద్రజ (Indraja) పేరుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. ఆమె అసలు పేరు రజతి. తెలుగుతో పాటు తమిళం, మళయాలం సినిమాల్లోనూ నటించారు. చిన్నతనం నుంచే నాట్యంలో రాణిస్తూ వచ్చింది ఇంద్రజ. మాధవపెద్ది మూర్తి వద్ద నాట్యంలో శిక్షణ తీసుకుంది.
ఇంద్రజ పాటలు అద్భుతంగా పాడుతూ గాయినిగా రాణించింది. 1995 నుంచి దశాబ్దం పాటు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఫేమ్ పొందింది. తొలుత ఓ తమిళ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కమెడియన్ ఆలీతో నటించిన యమలీల సినిమాతో తెలుగు నాట విపరీతమైన పాపులారిటీ దక్కిచుకుంది ఇంద్రజ. ఈ చిత్రం అఖండ విజయం సొంతం చేసుకుంది. ఒకే ఏడాది 1995లో ఏకంగా 15 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది ఇంద్రజ.
మొత్తంగా తన కెరీర్ లో వందకుపైగా చిత్రాల్లో నటించింది ఇంద్రజ. 2007 తర్వాత పెళ్లి చేసుకొని కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇంద్రజకు కుమార్తె సారా ఉంది. ఇంద్రజ భర్త పేరు మొహమ్మద్ అబ్సర్. ఈయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ కొన్ని సీరియళ్లలో కూడానటించాడు. అయితే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇంద్రజ.. ముస్లింను పెళ్లాడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. వీరిది ప్రేమ వివాహమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇంద్రజ ఇంట్లో వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదట. చేసేదేమీ లేక చివరకు రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నారట. ఇంద్రజ పూర్తిగా శాకాహారి కావడంతో భర్త అబ్సర్ కుటుంబం కూడా శాకాహారంలోకి మారిపోయారట. ఇంట్లో నాన్ వెజ్ చేయరట. కానీ, బయటకు వెళ్లినప్పుడు తినొచ్చని అనుమతి ఇచ్చిందట నటి ఇంద్రజ. అలా ఇంద్రజ కోసం ఆమె భర్త అడ్జస్ట్ అయ్యాడట.
ఇంద్రజ తెలుగు, మలయాళ సినిమాల్లో నటించారు. ఈమె ఒక తెలుగు కుటుంబంలో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబంలో పుట్టిన ఇంద్రజ.. గాయినిగా రాణించారు. ముగ్గురు అక్క చెళ్లెల్లలో ఇంద్రజనే పెద్దమ్మాయి. భారతి, శోభ ఈమె చెల్లెళ్లు. ఇంద్రజ అసలు పేరు రజతి. స్కూల్లో కూడా రజతి సంగీత, నాటక పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది.
శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఇంద్రజ.. మూర్తి బృందంతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు కూడా ఇచ్చింది ఇంద్రజ. ఆమె తొలి సినిమా జంతర్ మంతర్. అయితే, ఎస్వీ కృష్ణారెడ్డి ఆలీ హీరోగా తీసిన యమలీల ముందుగా విడుదలై భారీ హిట్ కొట్టింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండేళ్లలోనే 30కి పైగా సినిమాల్లో కథానాయికగా నటించింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా మూవీలో ఇంద్రజ నటనకు విమర్శకులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆమె నటనలో 1993 నుంచి 2007 దాకా యాక్టివ్‌గా ఉంది. తర్వాత గ్యాప్ తీసుకుంది. అనంతరం 2014 నుంచి ఇప్పటి దాకా వివిధ షోలు, మూవీల్లో సైడ్ క్యారెక్టర్స్, అమ్మ పాత్రలు చేస్తోంది.
Read Also : Krithi Shetty: ఆ యంగ్ హీరో పక్కన మూవీ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ!