PVT 04: రుద్రకాళేశ్వర్ రెడ్డిగా పంజా వైష్ణవ్ తేజ్.. ఫస్ట్ గ్లింప్స్ అదిరింది!

PVT 04: ఉప్పెన మూవీతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. తనదైన శైలిలో సినిమాలతో అలరిస్తున్నాడు. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) తాజాగా మరో మూవీతో వస్తున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి కమర్షియల్ బ్యాక్ డ్రాప్‌లో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘PVT 04’ (PVT 04) వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ వస్తోంది. సెట్స్‌పైకి వెళ్లిన వైష్ణవ్ తేజ్ మూవీకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి (Director Sreekath Reddy) ఇప్పటికే మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా ఓ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అహం బ్రహ్మస్మి మూవీని తీయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో పంజా వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పెట్టి తాజాగా సినిమాను చేస్తున్నారు. పెళ్లిసదంD మూవీ ఫేమ్, యువ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో కథానాయకురాలిగా నటిస్తోంది. ఈ సినిమాకు ఆది కేశవ (AadiKeshava) అనే టైటల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ఇతర సైడ్ యాక్టర్లను కూడా ప్రకటించారు.

ఆది కేశవ సినిమాలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.తమిళ హీరోయిన్ అపర్ణ దాస్ మరో కీ రోల్ లో కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మూవీకి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్‌లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడంటూ అప్పుడే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్‌ అవుతోంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ దిశగా ఆది కేశవ ఫస్ట్ గ్లింప్స్ దూసుకెళ్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ కాస్త డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు.

తాజాగా బ్యాక్ టు బ్యాక్ ఆర్టిస్టుల పోస్టర్స్ ని మేకర్స్ విడుదల చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ పేరును ప్రకటిస్తూ గ్లిమ్ప్స్ ని లాంచ్ చేయడం విశేషం. ‘PVT 04’కి ఆదికేశవ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్లు. ఫస్ట్ గ్లిమ్ప్స్ ను చాలా మాస్ గా కట్ చేసి ఆడియన్స్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. టెంప్లేట్ కమర్షియల్ మూవీని గుర్తు చేసేలా ఉంది. ఒక గుడిని కూల్చడానికి కొంతమంది మనుషులు వెళ్తారు. అక్కడ పూజారి ఆపేందుకు ప్రయత్నిస్తాడు.

అప్పుడే రౌడీలని హీరో బాదే ఇంట్రో సీన్ పెట్టారు. ఈ విషయం మెయిన్ విలన్ దాకా వెళ్తుంది. తన మనుషులని కొట్టింది ఎవరు అని అడుగుతాడు. అప్పుడే కథానాయకుడి ఇంట్రడక్షన్ చూపించారు. ఇక్కడ ఆది కేశవ గ్లింప్స్ ని బాగా కట్ చేశారు. అప్పుడే విలన్ వద్ద ఉన్న అనుచరుడు హీరో వైష్ణవ్ తేజ్ ను’రుద్ర కాళేశ్వర రెడ్డి’గా పవర్ ఫుల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఇంట్రడక్షన్ ఇస్తారు. గ్లింప్స్ లో హీరో వైష్ణవ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కాస్త డిఫరెంట్ గా ఉంది.

బాడీ సిక్స్ ప్యాక్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ చాలా ఫిట్ గా కనిపిస్తాడు. ఆలయం కథ నేపథ్యంలో ఆసక్తికరంగా ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టాయి. కార్తికేయ లాంటి సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇంతకు ముందు వచ్చిన సినిమాలకు, ‘ఆదికేశవ’ సినిమాకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ మూవీలో కథను ఎలా చూపిస్తారనేది సినిమా ట్రైలర్ చూస్తేగానీ అర్థం కాదు. మొత్తానికి ఆది కేశవతో పంజా వైష్ణవ్ తేజ్ కు పవర్ ఫుల్ క్యారెక్టర్ దొరికిందంటూ సోషల్ మీడియాలో అభిమానులు హల్ చల్ చేస్తున్నారు.

Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles