Mangalavaram: RX 100 మూవీతో సంచలన హిట్ అందుకున్న డైరెక్టర్ (Director Ajay Bhupati) అజయ్ భూపతి. ఆ మూవీలో కార్తికేయ (Hero Karthikeya) హీరోగా భారీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మాట్లాడుతూ తన మూవీ హిట్ అయ్యి తీరుతుందంటూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి సుమారు మూడేళ్లపాటు బ్రేక్ తీసుకున్నాడు. తొలి సినిమాతోనే కార్తికేయ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత కొన్ని సినిమాల్లో మెరిశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం పొందిన కార్తికేయ.. నాని సినిమాలో విలన్‌గానూ నటించి మెప్పించాడు.
మూడేళ్ల గ్యాప్ తర్వాత కాస్త ఆలోచించి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అజయ్ భూపతి. సిద్ధార్థ్, శర్వానంద్ కాంబోలో మూవీ తీసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. మహాసముద్రం (Mahasamudram) మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రాజెక్టుపై కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అజయ్ భూపతి. మహాసముద్రం మూవీ కాస్త డిఫరెంట్ యాంగిల్‌లో తీసుకొచ్చినప్పటికీ ప్రేక్షకులు ఆదరించలేదు.
ఇక మహాసముద్రం మూవీ డిజాస్టర్ నేపథ్యంలో దర్శకుడు అజయ్ భూపతిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఒకప్పుడు రొటీన్ మూవీస్ చూసేవాళ్లు తన సినిమాను చూడటానికి రావొద్దని నేరుగా చెప్పిన దర్శకుడు అజయ్ భూపతి ఒక్కడే కావడం గమనార్హం. అయితే, మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్‌హిట్ కొట్టి రెండో మూవీ ఇలా తీశాడేంటి అంటూ దర్శకుడిపై విమర్శలు వచ్చాయి.
ఇక మహాసముద్రం తీసి కూడా ఏడాది పూర్తి అయ్యింది. దర్శకుడు అజయ్ భూపతి కొత్త ప్రాజెక్టు ఇంకా అనౌన్స్‌మెంట్ చేయలేదు. దీనిపై మొన్నామధ్యనే విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడని ప్రకటించారు. రా అండ్ రస్టిక్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని తేలింది. దర్శకత్వంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామ్యం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి మంగళవారం అనే టైటిల్ కూడా ఖాయం చేశారు.
తన తొలి చిత్ర హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) హీరోయిన్‌గా ‘మంగళవారం’ (Mangalavaram) మూవీని తీయబోతున్నట్లు వెల్లడించాడు దర్శకుడు. ఇందులో పాయల్ పాత్రను శైలజగా పరిచయం చేశారు. వీపుపై ఎలాంటి బట్టల్లేకుండా ఉన్న పాయల్ ఫొటోను రిలీజ్ చేశారు. ఆమె చేతి వేలిపై సీతాకోకచిలుక ఉంది. ఓ ఆసక్తికర కథతో ఈ సినిమాను తీర్చిదిద్దితున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట.
ఈ సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి ‘మంగళవారం’ టైటిల్ జనానికి కాస్త ఆసక్తికరంగా ఉంటోంది. దీన్నొక క్రైమ్ అండ్ ఎరోటిక్ థ్రిల్లర్‌గా అజయ్ భూపతి రూపొందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సినిమా మొత్తం పాయల్ పాత్ర చుట్టే తిరుగుతుందని చెబుతున్నారు. హత్యలు జరగడం వెనుక ఎవరూ ఊహించని ట్విస్ట్ చూపించబోతున్నారట. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also : Krithi Shetty: ఆ యంగ్ హీరో పక్కన మూవీ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ!