నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. అది సినిమా సెట్ లో అయినా, షూటింగ్ సమయంలో అయినా, బయట వేదికలపై అయినా, ఆహా షోలో అయినా… ఇలా బాలయ్య (Balakrishna) ఎక్కడుంటే అక్కడ ఎంటర్ టైన్ మెంట్ పక్కా అని ఫ్యాన్ చెబుతుంటారు. బాలయ్య (Balakrishna) ముక్కుసూటి తనంగా మాట్లాడతారనే దానికి నిదర్శనంగా ఓ ఈవెంట్ లో ఇన్సిడెంట్ జరిగింది.
అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఊర్వశివో, రాక్షసివో. ఆ సినిమా ఓ మోస్తరు హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించిన సందర్భంగా ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ వచ్చారు. వేదిక మీదకొచ్చిన బాలయ్య తన దైన శైలిలో ఫన్ క్రియేట్ చేశారు. ఫంక్షన్ లో అల్లు శిరీష్ బాలకృష్ణ ను ఓ ప్రశ్న అడుగుతాడు. బాలయ్య దానికి తనదైన స్టైల్ లో జవాబిచ్చాడు. ఆ జవాబు విన్నాక బాలయ్య ఎంత ముక్కు సూటి మనిషో మరోసారి జనాలకకు తెలిసొచ్చింది. అందుకే అందరూ జై బాలయ్య అంటారని చెబుతున్నారు.
సినిమాలన్నాక కొన్ని విజయం సాధిస్తుంటాయి. లేదా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుంటాయి. అలాంటిది అది తన సినిమా అయినా సరే ఆడిందో లేదో టక్కును చెప్పేశాడు బాలయ్య. అల్లు శిరీష్.. బాలయ్యను సింహ, సింహంతో ఉన్న పేర్ల సినిమాలు చెప్పమంటాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మి నరసింహ, జయసింహా, ఇప్పుడు రాబోతున్న వీర సింహ రెడ్డి.. ఇలా సినిమా పేర్లు చెబుతాడు. ఇంకోటి కూడా ఉంది చెప్పమంటాడు అల్లు శిరీష్. బొబ్బిలి సింహం అని చెబుతాడు బాలయ్య. మరో సినిమా ఉందంటాడు అల్లు శిరీష్. తర్వాత శిరీష్ సింహం నవ్వింది సినిమా ఉందని చెబుతాడు. ఈ సమయంలో సింహం నవ్వింది పోయిందిగా.. అని సమాధానమిస్తాడు. లేకపోతే సింహం నవ్వటం ఏమిటి? అందుకే పోయింది అని సమాధానమిస్తాడు.
జయసుధపై నరేష్ అలా కామెంట్ చేశాడా?
సీనియర్ యాక్టర్, ఒకప్పటి హీరో నరేష్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న చాలా సినిమాల్లో హీరోలు, హీరోయిన్ల తండ్రి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే నరేష్.. తనదైన కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంటాడు. సీరియస్ వేషమైనా, కామెడీ అయినా, నటనలో పండిపోయిన నరేష్.. ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంలో ఓరయ్యో నా అయ్యా పాటలో తన హావ భావాలతో జనాలందరినీ ఏడిపించేసిన నరేష్.. అ ఆ.. సినిమాలో సమంత తండ్రిగా తనదైన కామెడీ రోల్ పోషించారు. ఇలా ఏ రకమైన పాత్ర చేయాలన్నా సిద్ధమైపోతారు నరేష్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేష్.. పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
తాను బాల నటుడిగా చేసిన చిత్రాల్లో కుటుంబమంతా కలిసి నటించామన్నాడు నరేష్. అప్పట్లో తనకు ఏడేళ్లు ఉండేవని.. ఆ సమయంలో 12 సంవత్సరాలున్న జయసుధ తన ఫస్ట్ కజిన్ అని తెలిపాడు. హీరోగా చేసిన సినిమాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కు కాస్త సమయం తీసుకున్నానన్న నరేష్.. ఇప్పుడు బిజీగానే ఉన్నానని తెలిపాడు. జంధ్యాల, విజయనిర్మల తన గురువులని చెప్పాడు.
రచయితగా జంధ్యాల అంటే అమితమైన ఇష్టమని నరేష్ చెప్పాడు. ఈ విషయంలో జంధ్యాలను బీట్ చేసేవారు లేరన్నాడు. ఆయన ఎన్నో కుటుంబాల్లో దీపం వెలిగేలా చేశారని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నానని తెలిపాడు. ఇటీవల పవిత్రా లోకేష్, నరేష్ ఎపిసోడ్ తో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. నరేష్ ను అభిమానించే వారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు.
Read Also : Vishal: విశాల్ ప్రేమాయణంపై రూమర్లు.. నిజం కాదన్న నటి!