Ashish Vidyarthi: విలక్షణ నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు. సినిమాల్లో నటించేందుకు వయసైపోయిందని కాదు దీని అర్థం.. సంసార జీవితం విషయంలో!! వయసు మళ్లిన వారు ఎవరైనా తమకు తోడు కోరుకోవడం సహజమే. ఆ వయసులో భాగస్వామి తోడుంటే తిండికి బట్టకు లోటుండకూడదని అందరూ అనుకుంటారు. ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) కూడా అలానే ఆలోచించారేమోగానీ.. 60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఆశిష్ విద్యార్థి. ముఖ్యంగా పోకిరి మూవీలో ఆయన చేసిన యాక్టింగ్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఎన్నో హిట్ చిత్రాల్లో ఆశిష్ విద్యార్థి నటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించి మెప్పించారు. గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఆశిష్ విద్యార్థి.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా 60 ఏళ్ల ఏజ్‌లో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో కూడా పేరున్న యాక్టర్ కావడంతో ఈ అంశం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అసోంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను తాజాగా గురువారం కోల్‌కతా క్లబ్‌లో ఆశిష్ విద్యార్థి మనువాడారు. అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఆశిష్ విద్యార్థి గతంలో నటి శకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను వివాహం చేసుకున్నారు. అయితే, వారి మధ్య పొసగక పోవడం, విభేదాల కారణంగా ఇద్దరూ దూరమయ్యారు. వీరికి అర్త్ విద్యార్థి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, ఆశిష్ విద్యార్థి రెండో వైఫ్ రూపాలి కోల్‌కతాలో ఓ ఫ్యాషన్ స్టోర్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. రూపాలి, ఆశిష్ విద్యార్థి.. ఇద్దరి కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారట.
తన జీవితంలో ఈ దశలో, రూపాలిని పెళ్లి చేసుకోవడం ఒక అసాధారణ అనుభూతి అని ఆశిష్ వ్యాఖ్యానించారు. ఆశిష్ విద్యార్థి 1962లో జూన్ 19వ తేదీన ఢిల్లీలో పుట్టారు. ఆయన తండ్రిది కేరళలోని కన్నూర్. అమ్మ బెంగాలీ. కానీ రాజస్థాన్‌లో కాపురం ఉండేవాళ్లు. ఆశిష్ విద్యార్థి తండ్రి గోవింద్ విద్యార్థి ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్ గా పేరు గాంచారు. తండ్రి ప్రభావంతో ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆశిష్. అనతి కాలంలోనే మంచి నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల తెలుగులో వచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’లో హీరో తండ్రి పాత్రలో మంచి నటనతో ఆకట్టుకున్నారు.
ఆశిష్ వాళ్ల అమ్మ రేబా విద్యార్థి పేరున్న కథక్ నృత్యకారిణి. ఈయన ఢిల్లీలో పెరిగి పెద్దవాడయ్యాడు. హిందీ సినిమాలలో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. 2014 అక్టోబర్ 20వ తేదీన ఆశిష్ విద్యార్థికి తృటిలో ప్రమాదం తప్పింది. భిలాయి సమీపంలో బాలీవుడ్ డైరీ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా ఆశిష్ నదిలో నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా నిలబడ్డారు. ఆ సమయంలో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోయింది. ఆశీష్ నీటిలో మునిగిపోతుండగా… అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ వికాస్ సింగ్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకి ఆశిష్ ను రక్షించారు.
Read Also : Krithi Shetty: ఆ యంగ్ హీరో పక్కన మూవీ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ!