Apaar: అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అన్వేష్ వారాల ’అపార్’ ప్రదర్శన

Apaar: దేశంలో పలు ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో అధికారిక ఎంట్రీగా ‘అపార్’ లఘు చిత్రం ఎంపికయ్యింది. అనేక ఏళ్లుగా ప్రభుత్వాలూ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి అపార్ ఎంపిక కావడం విశేషం. ఈ ‘అపార్’ చిత్రానికి తెలంగాణకు చెందిన అన్వేష్ వారాల డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించాడు. (Apaar)

కరీంనగర్ పట్టణానికి చెందిన అన్వేష్ వారాల మొదట కేరళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏవియానిక్స్ చదివాడు. ఇస్రోలో ఉద్యోగాన్ని కాదనుకుని తనకున్న ఆసక్తి మేరకు సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్ లో పీజీ కోర్స్ ఇన్ సినిమాటోగ్రఫీ చదివాడు. ఇన్‌స్టిట్యూట్ లో నిర్మించిన ‘అపార్ ఉత్తర్ ప్రదేశ్ లో నిర్వహిస్తున్న ‘జాగరణ్‌” ఫిల్మ్ ఫెస్టివల్ కు అధికారిక ఎంట్రీగా ఎంపికయిన ‘దర్భంగా’, ‘బరేల్లీ’, ‘వారణాసి’ నగరాలల్లో ప్రదర్శించబడి విశేష ప్రశంశల్ని అందుకుంది.

తర్వాత బెంగళూరు లో నిర్వహించిన ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘బెంగళూరు క్వీర్ ఫిల్మ్ ఎస్టివల్ 23 కి ఎంపికయింది. ఈ ఫెస్టివల్ లో అనేక జాతీయ అంతర్జాతీయ సినిమాల్ని ప్రదర్శించారు. ఇంకా అపార్ చిత్రం 28వ అంతర్జాతీయ కోల్ కత్తా ఫిల్మ్ ఫెస్టివల్ ల కూడా అధికారిక ఎంట్రీగా ప్రదర్శింంచారు. ఇలా సినిమాటోగ్రాఫర్ గా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న అన్వేష్ వారాల ఇప్పటివరకు ‘పట్నం’ బతుకే క కల’ లాంటి పలు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు.

కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో కోర్సు పూర్తి చేసుకుని మంచి సినిమాలకు కెమెరా వర్క్ చేయాలనుందని అదే తన జీవిత లక్ష్యమని అంటున్నాడు. ఎస్టివల్ నెట్వర్క్ మాత్రమే కాకుండా మంచి సాంకేతిక విలువలతో నిర్మించే సినిమాలకు పనిచేయాలనుందని చెబుతున్నాడు.

15 నిముషాల నిడివి గల ఈ “అపార్” షార్ట్ ఫిలిం లెస్బియన్ సమస్య మీద రూపొందించబడింది. ఈ లఘు చిత్రంలో మధ్యమ హల్దార్, రాజా చక్రవర్తి, అర్పితా డే తదితరులు నటించగా అభిసోన్ యుమ్నం దర్శకత్వం వహించాడు, కథా కథనం శృతి పార్థసారధి, సినిమాటోగ్రఫీ వారాల అన్వేష్, ఎడిటింగ్ అంకిత్ ప్రకాష్, ఆర్ట్ స్వరాజ్ సిద్దార్థ్, నిర్మాణం ప్రధమేష్ నిర్వహించారు.

ఇదీ చదవండి: Usiri oil benefits: ఉసిరి నూనెతో కురులకు బోలెడు లాభాలు

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles