నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, భవన నిర్మాణం, ఇతర కార్మికులకు చెందిన ఆడ బిడ్డల పెళ్లిళ్లు గౌరవప్రదంగా జరిపించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా (YSR Kalyanamasthu Shadi tofa) పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ఆర్థికసాయం అందిస్తోంది. పేద తల్లిదండ్రులు తమ బిడ్డల చదువు, పెళ్లికి ఏమాత్రం ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకానికి (YSR Kalyanamasthu Shadi tofa) శ్రీకారం చుట్టారు.
పథకం: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా
లక్ష్యం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకుండా చూడడం; బాల్యవివాహాలను అరికట్టడం; పేదింటి పిల్లలు అర్ధాంతరంగా చదువు మానేయకుండా చేయడం; పాఠశాలల్లో చేరికలు పెంచడం, కనీసం పదోతరగతి ఉత్తీర్ణులయ్యేలా ప్రోత్సహించడం.
అర్హతలు..
* పెళ్లిరోజు నాటికి వరుడికి 21, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
* వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* భర్త చనిపోయిన మహిళ రెండో పెళ్లి చేసుకున్నా అర్హురాలే.
* కుటుంబ ఆదాయం నెలకు పల్లెల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించకూడదు.
* భూమి మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు లేదా రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు.
* కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్లు ఉండకూడదు.
* పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
* కారు ఉండరాదు. ఆటో, ట్రాక్టర్, ట్యాక్సీకి మినహాయింపు ఉంది.
* కుటుంబం నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు మించకూడదు.
* ఆదాయపు పన్ను చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు.
* పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి నివాస స్థలం ఉండకూడదు.
సాయం ఎంత అందిస్తారంటే..
* ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు. కులాంతర వివాహం చేసుకుంటే రూ.1,20,000 ఇస్తారు.
* బీసీలకు రూ.50,000. కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు ఇస్తారు.
* మైనార్టీలకు రూ.లక్ష, విభిన్న ప్రతిభావంతులకు రూ.1,50,000 ఇస్తారు.
* భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.40,000 అందజేస్తారు.
దరఖాస్తు ఇలా..
* మొదట సచివాలయాల ద్వారా పెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలి.
* వివాహం జరిగిన 30 రోజుల్లోపు గ్రామ/వార్డు సచివాలయాల్లో ద్వారా నవశకం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* నిబంధనల మేరకు ధ్రువపత్రాలను జతచేయాలి. ముఖ్యంగా పెళ్లి పత్రిక, పెళ్లి ఫొటోలు, మ్యారేజ్‌సర్టిఫికెట్, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతా జిరాక్స్, వధూవరుల పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ల జిరాక్సు తప్పనిసరి.
* భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి.
* అందిన దరఖాస్తులను గ్రామ సచివాలయం, మండల, జిల్లా స్థాయిల్లో 15 రోజుల్లో ఆడిట్ చేస్తారు.
* ఇలా ఏడాది కాలంలో జరిగిన వివాహాలకు నాలుగు విడతలుగా (ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ ) ఆర్థిక సాయం విడుదల చేస్తారు.
* పూర్తి వివరాలు నవశకం బెనిఫిషియరీస్ మేనేజ్‌మెంట్ పోర్టల్ https//gsws-nbm.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
ప్రభుత్వం అందించిన సాయం ఇదీ..
* 2023 ఫిబ్రవరి 10వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు.
* అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేసిన సీఎం జగన్.
* 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి చేకూరిన లబ్ధి.
* వివిధ వర్గాల నుంచి అందిన వినతుల మేరకు వైఎస్సార్, కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ఆర్థిక సాయాన్ని పెళ్లికూతురు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
* ఒక వేళ పెళ్లికూతురి తల్లి మరణిస్తే ఆమె తండ్రి లేదా అన్నదమ్ములు లేదా గార్డియన్‌గా వ్యవహరించే ఇతరులకు ఆర్థికసాయం అందజేస్తారు.
* 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని 2023, మే 5న బటన్ నొక్కి జమ చేసిన సీఎం జగన్.
* గత ఆరు నెలల్లోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.125.50 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.
* వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1902కు కాల్ చేయొచ్చు.
జనవరి నుంచి మార్చి మధ్య వివాహమైన 12,132 మంది లబ్ధిదారులకు ఈరోజు 87.32 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన ప్రభుత్వం. #cmjagan #kalyanamastu #ysjagancares #ysjaganwavecontinues #ysjaganmarkgovernance pic.twitter.com/HPTkUJZLsN
— Jagane Kavali (@JaganeKavali) May 5, 2023
Read Also : UnEmployment: జాబ్‌లెస్ లైఫ్.. ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా 8% దాటిన నిరుద్యోగిత రేటు..!