YS Avinash Reddy News: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ.. ఇటీవల కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చుట్టూ దర్యాప్తు కోణం కొనసాగిస్తోంది. అయితే, అవినాశ్ రెడ్డి అరెస్టు అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయడంతో మరోసారి ఈ కేసుపై ఉత్కంఠ ఏర్పడింది. (YS Avinash Reddy News)
ఈ మేరకు సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేశారు. వివేకానంద రెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ చెబుతోంది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సూత్రధారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ వాదిస్తోంది.
వైఎస్ వివేకా హత్య కేసు పై సుప్రీంకోర్టుకు సీబీఐ వెళ్లడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. ఈనెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ చెబుతోంది.
వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారంటూ అఫిడవిట్ లో సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. వివేకాది గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని సీబీఐ పేర్కొంటోంది. అవినాష్ రెడ్డి పాత్ర పై ఇంకా దర్యాప్తు చేయాలని సీబీఐ చెబుతోంది.