Tirumala Samacharam (24-07-2023): అక్టోబర్ మాసానికి సంబంధించి దర్శన టికెట్లను నేడు ఆన్‌లైన్ ద్వారా టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేశారు. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అలాగే రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. (Tirumala Samacharam (24-07-2023)
Read Also : Gold Price today 24 July 2023: దిగిరానంటున్న బంగారం ధర.. నేడు పసిడి, వెండి రేట్లు ఇవీ..
శ్రీవాణి దాతలకు దర్శనం, వసతి కేటాయింపు చేయనుంది టీటీడీ. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు అదనపు కోటాను రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.