NIA inspections: హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని భవానీ, లాయర్ సురేష్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. అల్వాల్‌లోని సుభాష్‌నగర్‌లో బంధుమిత్రుల సంఘం సభ్యుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు చేసింది. నెల్లూరులో ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పౌర హక్కుల ఉద్యమంలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. (NIA inspections)
తిరుపతిలో క్రాంతి చైతన్య ఇంట్లో తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి.రాజారావును ఎన్ఐఏ అధికారులు విచారణ చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దుడ్డు వెంకట్రావు ఇంట్లో సోదాలు చేశారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకుడిగా వెంకట్రావు ఉన్నారు.
మంగళగిరి మండలం నవులూరు ముక్కేవారపేటలో పచ్చల కిరణ్‌కుమార్ అనే డ్రైవర్ ఇంట్లో తనిఖీలు జరిగాయి. కిరణ్‌కుమార్ విప్లవ రచయితల సంఘంలో యాక్టివ్ సభ్యుడిగా ఉన్నాడు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని అల్లిపురంలో కావలి బాలయ్యను ఎన్ఐఏ అధికారులు విచారణ చేశారు. మావోయిస్టులతో సంబంధాలపై బాలయ్యను ఎన్ఐఏ విచారించింది. కేఎన్‌పీఎస్ సంస్థలో జిల్లా అధ్యక్షుడిగా బాలయ్య ఉన్నాడు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు దొందు ప్రభాకర్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నెల్లూరు ఫతేఖాన్‌పేటలోని చైతన్య మహిళా సంఘం నేత అన్నపూర్ణమ్మ ఇంట్లో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు చేశారు. గతంలోనూ అన్నపూర్ణమ్మ, అనూష ఇళ్లలో ఏన్ఐఏ శోధించింది.
ఏపీలో ఆరు చోట్ల ఎన్ఐఏ సోదాలు
నెల్లూరులో ఏపీసీఎల్ సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరిగాయి. పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా ఎల్లంకి వెంకటేశ్వర్లు పని చేస్తున్నారు. నెల్లూరు అరుణ, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లల్లో ఎన్ఐఏ తనిఖీలు జరిగాయి. అన్నపూర్ణ, అనూష నివాసంలో ఎన్ఐఏ తనిఖీలు చేసింది. ఇక న్యాయవాది క్రాంతి చైతన్య ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు చేసింది. ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత సురేష్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు జరిపింది. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలే టార్గెట్ గా రైడ్స్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: PM Modi in Telangana: తెలంగాణలో అవినీతిరహిత పాలన కావాలి.. ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ