Sajjala on TDP: టీడీపీ చేస్తున్న డ్రామాలను ప్రజలు పట్టించుకోవడం లేదు: సజ్జల కౌంటర్‌

Sajjala on TDP: చంద్రబాబు అరెస్టు పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టీడీపీ చేస్తున్న డ్రామాలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ భావోద్వేగానికి అవకాశం ఉండే అంశం కాదన్నారు. ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్ కు పంపిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. (Sajjala on TDP) నిన్న మీడియాతో మాట్లాడిన సజ్జల ఇంకా ఏమన్నారంటే..

* సీఎం జగన్ పై తప్పుడు కేసులు పెట్టినప్పుడు న్యాయపరంగానే పోరాడాం.
* ప్రజా కోర్టులో సీఎం జగన్ తిరుగులేని విజయం సాధించారు.
* 2019 లో 151 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చారు.
* చంద్రబాబు జైలులో ఉండడం దారుణం అన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది.

* వేర్వేరు కారణాలతో చనిపోయినా చంద్రబాబు కోసమే మృతి చెందినట్లు ప్రచారం చేస్తున్నారు.
* టీడీపీ స్టేక్ హోల్డర్స్ అంతా కలిసి నిన్న హైదరాబాద్ లో ఈవెంట్ చేశారు.
* ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేదు.
* ఏదో మ్యూజికల్ ఈవెంట్ కు రిహార్సల్ చేసినట్టు ప్రదర్శన చేశారు.
* స్కిల్ స్కామ్ కేసు గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు.

* టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలి ఈవెంట్ తో అందరికీ తెలిసింది.
* ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో మేం ఇది చేశామని చెప్పుకుని ఎన్నికలకు వెళ్లాలి.
* మేం సంక్షేమ పాలన అందించామని చెప్పి ప్రజల ముందుకెళ్తున్నాం.
* మేనిఫెస్టో ను చెత్తబుట్టకే పరిమితం చేసిన వ్యక్తి చంద్రబాబు.

* మేనిఫెస్టో లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్.
* చంద్రబాబు వదిలేసిన బకాయిలను కూడా మేమే చెల్లించాం.
* అవినీతికి పాల్పడలేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారు.
* సానుభూతి పొందాలని టీడీపీ చేస్తున్న డ్రామాలు ప్రజలు నమ్మడం లేదు.
* కావలి లో టీడీపీ నేతలు గుండాలుగా రెచ్చిపోయారు.
* నిజం గడప దాటేసరికి అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తుంది.

* టీడీపీ నేతలు అబద్దాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం.
* వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు చంద్రబాబుదే.
* వంచన, వెన్నుపోటు, అబద్దం .. వీటికి చిరునామా చంద్రబాబే.
* రైతులను నిలువునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.

Read Also :AP Banking Good: ఆంధ్రప్రదేశ్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles