CM Jagan Tour postponed: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలాపురం పర్యటన వాయిదా పడింది. ఈనెల 26న (రేపు) సీఎం జగన్.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించాల్సి ఉంది. (CM Jagan Tour postponed)
రేపు అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు. తదుపరి ఈనెల 28వ తేదీన అమలాపురంలో సీఎం పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.