Big Breaking on Ramojirao: తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్త. మీడియా మొఘల్ రామోజీరావుపై మరో కేసు పెట్టారు. మార్గదర్శి తమదేనంటూ జీజే రెడ్డి వారసులు కేసుపెట్టారు. తాను సంతకం చేయకుండానే తన షేర్లు ఫోర్జరీ సంతకంతో లాగేసుకున్నారంటూ కేసు పెట్టారు. జీజే రెడ్డి వారసుడు యూరిరెడ్డి ఈ మేరకు పోలీసు స్టేషన్‌మెట్లెక్కారు. (Big Breaking on Ramojirao)
* నా తండ్రి జగన్నాథరెడ్డి వద్ద రామోజీరావు 1962లో టైపిస్టుగా చేరాడు.
* రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ ప్రారంభిస్తానంటే పెట్టుబడిగా 1962లో రూ.5 వేలు ఇచ్చాం
* అందుకు గాను మా నాన్నకు మార్గదర్శి చిట్‌ఫండ్ లో రామోజీరావు షేర్లు కేటాయించారు.
* మా నాన్న చనిపోయాక మార్గదర్శి చిట్‌ఫండ్ లో షేర్ల గురించి మాకు తెలియలేదు.
* 2014లో మీడియాలో వచ్చిన కథనాలతో మా నాన్నకు మార్గదర్శిలో వాటాలున్నాయని తెలిసింది.
* మార్గదర్శిలో మా వాటా గురించి మాట్లాడేందుకు రామోజీరావును పలుమార్లు సంప్రదించాం.
* ఎన్నిసార్లు ప్రయత్నించినా రామోజీరావు మమ్మల్ని కలవలేదు.
* చివరకు 2016 సెప్టెంబర్ 10న రామోజీ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
* మా నాన్న పేరు పై ఉన్న షేర్లను నాపేరుతో బదిలీ చేయాలని కోరాను.
* షేర్లను బదిలీ చేయడానికి ఆ రోజు రామోజీరావు ఒప్పుకున్నారు.
* 29 సెప్టెంబర్ 2016 రోజున రామోజీరావు రూ.39,74,400 విలువ చేసే యూనియన్ బ్యాంక్ చెక్ ను మాకు ఇచ్చారు.
* 2007-08 ఏడాదికి మా వాటా డివిడెండ్ గా రామోజీరావు చెప్పారు.
* తర్వాత కాలానికి డివిడెండ్ ఇవ్వాల్సిందిగా నేను రామోజీరావును అడిగాను.
* మళ్లీ కొద్ది రోజుల తర్వాత సెటిల్ చేస్తానని రామోజీరావు చెప్పారు.
* తిరిగి 5 అక్టోబర్ 2016న రామోజీరావును కలిశాను.
* ఆ రోజు మా తండ్రి వాటా నా పేరు మీద బదిలీ చేసేందుకు నా సోదరుడికి ఎలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్ పై సంతకం చేయాల్సిందిగా రామోజీరావు చెప్పారు.
* ఆ అఫిడవిట్ లో ఒక పేజీ ఖాళీగా ఉండటంతో నేను సంతకం చేయనని రామోజీరావుకు చెప్పాను.
* అప్పుడు కోపంతో రామోజీరావు తుపాకీతో నన్ను బెదరించారు.
* నిన్ను ఎవరూ కాపాడలేరు.. సంతకం చేయాలంటూ బెదిరించారు.
* దీంతో ప్రాణభయంతో నేను ఖాళీ కాగితం పైన సంతకం పెట్టాను.
* అదే రోజున నాకు రూ.2 లక్షల 88 వేల విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చారు.
* మా షేర్లు ఎవరికీ బదలాయించే ఉద్ధేశం లేకపోవడంతో ఆ చెక్ ను మేము నగదుగా మార్చలేదు.
* మార్గదర్శిలో మా వాటా షేర్లు అలాగే ఉన్నాయని ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చాను.
* ఇటీవల మార్గదర్శి కేసు పై మీడియాలో వస్తున్న కథనాలను చూసి తెలుసుకున్నాను.
* కంపెనీ రిజిస్ట్రార్ ద్వారా మా వాటా షేర్ల గురించి తెలుసుకుని ఖంగుతిన్నాను.
* నాతో బలవంతంగా సంతకం పెట్టించుకున్న రోజే రామోజీరావు మా షేర్లను శైలజా కిరణ్ పేరు పై బదలాయించారు.
* నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండానే రామోజీరావు మోసంగా మా వాటా లాక్కున్నారు.
* రామోజీరావు మోసం పై పోలీసులు విచారణ చేసి నాకు న్యాయం చేయాలి… అని గాదిరెడ్డి యూరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే మార్గదర్శిపై అటు ఉండవల్లి అరుణ్‌కుమార్, ఇటు ఏపీ ప్రభుత్వం కేసులు గట్టిగా పెట్టింది. తాజాగా గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు చేశారు.