Andhrajyothi petition: తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను దిగజార్చడం సహా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అన్యమత ప్రచారం జరిగితందంటూ 2019లో ఆంధ్రజ్యోతి వివాదాస్పద కథనం ప్రచురించింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై టీటీడీ కోర్టును ఆశ్రయించింది. తిరుపతి కోర్టులో రూ.100 కోట్లు పరువునష్టం దావా వేసింది టీటీడీ. (Andhrajyothi petition)
Read Also : Subramanian swamy: టీటీడీపై చంద్రబాబు, పవన్‌వి తప్పుడు ఆరోపణలు..: సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం
టీటీడీ తరఫున వాదనలు వినిపించేందుకు బీజేపీ మాజీ ఎంపీ, రాజకీయ నేత సుబ్రహ్మణ్య స్వామికి అనుమతి ఇవ్వాలని కోరుతూ టీటీడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. టీటీడీ తరఫున వాదనలు వినిపించేందుకు సుబ్రహ్మణ్య స్వామికి అనుమతి ఇస్తూ తిరుపతి కోర్టు నిర్ణయం వెలువరించింది.
తిరుపతి కోర్టు ఆదేశాలను ఆంధ్రజ్యోతి సవాల్ చేసింది. హైకోర్టులో ఆంధ్రజ్యోతి పిటిషన్ వేసింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం పిటిషన్ ను తాజాగా హైకోర్టు కొట్టివేసింది. తిరుపతి కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చుక్కెదురైంది.
Read Also : Gold Price today 23 July 2023: వెండి, బంగారం తగ్గాయి.. నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
అన్యమత ప్రచారం జరగకున్నా ఎందుకా కట్టుకథలు?
తిరుమల తిరుపతి దేవస్థానాలపై అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ఏపీలో ఓ రాజకీయ వర్గానికి సపోర్టు చేసే మీడియాలోనూ అత్యుత్సాహంగా కట్టు కథలు యథేచ్చగా వస్తూనే ఉన్నాయి. ధర్మాన్ని రక్షించేందుకు టీటీడీ కట్టుబడి ఉంది. స్వామి వారి ఆశీస్సులతో ఎల్లవేళలా భక్తులకు సేవలందింస్తోంది. కొందరు చేస్తున్న దుష్ప్రచారం వల్ల టీటీడీ ప్రతిష్ట మసకబారే పరిస్థితులు దాపురిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీపై అసత్యప్రచారాలు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.