Anakapalli: అనకాపల్లి జిల్లాలో మరో కొత్త పరిశ్రమ రాబోతోంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను యూఎస్‌ఏకు చెందిన సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఈవో, ఫౌండర్ మన్‌ప్రీత్ ఖైరా కలిశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలను ఉత్పత్తి చేసే పరిశ్రమను ఏర్పాటుకు సబ్‌స్ట్రేట్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ప్రాథమిక చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ వారికి చెప్పారు. (Anakapalli)
సీఎంతో జరిగిన సమావేశం అనంతరం మన్‌ప్రీత్ ఖైరా మాట్లాడుతూ, సీఎం జగన్‌తో భేటీ చాలా స్పూర్తిదాయకంగా జరిగిందన్నారు. విశాఖలో ఏఐ ఆధారిత హౌసింగ్, ఏఐ ఆధారిత తయారీ పరిశ్రమలకు సంబంధించి తమ ప్రతిపాదనలకు, ఆలోచనలకు పూర్తి సహకారం ఇస్తామని సీఎం తెలిపారన్నారు.
ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి, విశాఖలో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి స్థానిక యువతలో ప్రతిభను పెంపొందించే అంశాలపై చర్చించామన్నారు. సమావేశంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సబ్‌స్ట్రేట్ క్యాపిటల్ పార్ట్‌నర్ సిడ్నీ న్యూటన్, సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్ డెరెక్టర్ మన్‌దీప్ ఖైరా పాల్గొన్నారు.
విశాఖపట్నం పరిపాలన రాజధాని కానుండడంతో అక్కడ మరిన్ని ఐటీ, టెక్ పరిశ్రమలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. దసరా తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం విశాఖపట్నం తరలి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు కూడా దాదాపు ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. రాబోయే ఎన్నికల సమర శంఖం విశాఖ నుంచే పూరించే యోచనలో ఉన్న సీఎం జగన్.. ఆ మేరకు తన రాజకీయ శత్రువులను ఓడించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: CM Jagan in Vizag: దసరా ముహూర్తం.. విశాఖ నుంచే పాలనకు జగన్ సంసిద్ధం
Why not 175: 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు? గేర్ మార్చాల్సిందేనన్న సీఎం జగన్