25th ICID Congress Plenary: విశాఖలో ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ పై 25వ అంతర్జాతీయ సదస్సు జరిగింది. మూడ్రోజుల సదస్సుకు 90 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సులో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, గుడివాడ అమర్‌నాథ్, అధికారులు, ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి షెకావత్‌తో కలిసి సదస్సును సీఎం జగన్ ప్రారంభించారు. (25th ICID Congress Plenary)
సీఎం జగన్ మాట్లాడుతూ.. నీటి పారుదల రంగం పై సదస్సు జరగడం శుభపరిణామమన్నారు.
* సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు
* ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది
* ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది
* ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోవడమే లక్ష్యం
* రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది.
* వర్షం కురిసేది తక్కువ కాలమే…ఆ నీటిని సురక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి
* సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం.
* దిగువ నదీ తీర రాష్ట్రంగా నీటి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
* వంశధార, నాగావళి, కృష్ణా, గోదావరి నదుల అతివృష్టి, అనావృష్టితో నీటి నిర్వహణ సవాల్ గా మారింది
* ఒక బేసిన్ నుంచి మరో బేసిన్ కు నీటిని తరలించే వ్యవస్థలు ఏర్పాటు కావాలి.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. నీటిపారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు.
* ఇరిగేషన్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం.
* ప్రపంచ దేశాలకు భారత్ అతి పెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోంది.
* వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం.
* మోదీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం.
* రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం.
* భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
* నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలకు ఉపయోగం.
* వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికి నీటిని శుద్ధి చేస్తున్నాం.
* తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం.
* 2019లో మోదీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించాం.
* జలశక్తి అభియాన్ తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.
* నదుల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది
* ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నాం.
* డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ల ద్వారా డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది.
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్‌లను పరిరక్షిస్తున్నాం.
* ప్రపంచ బ్యాంకు సహకారంతో డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది.
* వరదలు పోటెత్తడంతో తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టం జరుగుతోంది. అని గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు.
Read Also : Actress Pragathi: చీర కట్టులో వర్కవుట్స్.. చూసి నేర్చుకోండి.. నటి ప్రగతి హుషారు మామూలుగా లేదుగా..